జనసేన పార్టీ ఆధ్వర్యంలో 73వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

అమలాపురం:డా బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శెట్టి బత్తుల రాజబాబు అధ్వర్యంలో 73వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ తరుపున దేశప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందిస్తూ డా బి.ఆర్. అంబేద్కర్ చే రూపొందించబడి, 1949 నవంబర్ 26న ఆమోదించబడిన సందర్భంగా దేశ ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు జన సైనికులు అంబేద్కర్ చిత్ర పటానికి నివాళులు అర్పించారు.