రామ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

అన్నమయ్యజిల్లా, రాయచోటి పట్టణ కేంద్రంలో 73వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శనివారం.. ప్రజా సంఘాలు మరియు వివిధ మాధ్యమాల నేతలతో కలిసి డా.బి.ఆర్.అంబేద్కర్ కు జనసేన కోఆర్డినేటర్ రామ శ్రీనివాస్ ఘనంగా నివాళులు అర్పించి.. అంబేద్కర్ సేవలను ఆదర్శంగా తీసుకుని, జ్ఞాపకాలను మానవ హక్కుల కోసం పోరాటలతో రాజ్యాంగ ఫలాలు అన్ని వర్గాల వారికి అందాలనే రాజ్యాంగ స్ఫూర్తిని రాజకీయాలకు అతీతంగా అమలుపరిచే రోజు రావాలని, ప్రజల్లో రాజ్యాంగం పట్ల అవగాహన రావాలని ఆకాంక్షిస్తూ.. ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.