జనసేన కార్యకర్త కుటుంబానికి జనసేన ఆర్థిక సహాయం

రాజమండ్రి: ఇటీవలే మరణించిన రెండవ వార్డు నారాయణపురంకి చెందిన జనసైనికుడు బెల్లం సందీప్ కుమార్ కుటుంబానికి బుధవారం ఉదయం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్చార్జ్ అనుశ్రీ సత్యనారాయణ మరియు సిటీ అధ్యక్షులు వై శ్రీనివాస్ ల చేతుల మీదుగా లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తలకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని, ప్రమాదవశాత్తు చనిపోయిన బెల్లం సందీప్ కుమార్ జనసేన క్రియాశీల సభ్యత్వం చేయించుకోకపోయినా ఎన్ఆర్ఐ నాగరాజు గారు 30000 రూపాయలు, అనుశ్రీ సత్యనారాయణ గారు & అనుశ్రీ యువత& రెండో వార్డ్ మానే ఆది బాబు గారు మిత్ర బృందం 60000 రూపాయలు, సిటీ అధ్యక్షులు వై శ్రీనివాస్ 10,000మరియు మరియు రెండో వార్డ్ జనసేన నాయకులు సహకారంతో బుధవారం మొత్తం వారి కుటుంబ సభ్యులకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి యమన నారాయణ గౌడ్, ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులు లిమరా భాష, పైడిరాజు, నల్లంశెట్టి వీరబాబు, సిటీ కార్యదర్శులు అల్లాటిరాజు, గుణ్ణం శ్యాంసుందర్, విన్న వాసు, సంయుక్త కార్యదర్శి దేవకివాడి చక్రపాణి, జనసేన పార్టీ యువ నాయకులు బయ్యపునీడిసూర్య మరియు జనసేన నాయకులు విక్టరీ వాసు, మానే ఆదిబాబు, మంచాల సునీల్, హేమ దుర్గా, మణికంఠ, వీరభద్రరావు, పిల్లి దుర్గాప్రసాద్, భగవాన్ మరియు విన్న వాసు మిత్ర బృందం రెండవ వార్డ్ జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.