రాజరాజేశ్వరి పేట వాసులకు న్యాయం చేయాలి

విజయవాడ, కలెక్టర్ ఢిల్లీ రావు రెవెన్యూ అధికారులు మరియు రైల్వే అధికారులతో కలిసి పాత రాజరాజేశ్వరి పేటలో పర్యటించిన సందర్భంలో జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ కలెక్టర్ ని కలిసి ఆర్ఆర్ పేట వాసులకు న్యాయం చేయాలని గత 40 సంవత్సరాలుగా వారు ఇక్కడే నివాసం ఉంటున్నారని రైల్వే అధికారులకు ప్రత్యామ్నాయ స్థలము కేటాయించి వీరికి ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన ఎల్లపటాలు కేటాయించి రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలని కోరారు. రైల్వే అధికారులు పదే పదే ఈ ప్రాంత వాసులకు నోటీసులు జారీ చేస్తూ తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారని, ఆర్ఆర్ పేట వాసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు అందుకు కలెక్టర్ ఢిల్లీరావు రైల్వే డిఆర్ఎంతో మాట్లాడి సానుకూల నిర్ణయం వచ్చేలాగా ప్రయత్నం చేస్తామన్నారు. మేయర్ స్థానంలో ఉన్న భాగ్యలక్ష్మి ఆర్ఆర్ పేట వాసులతో అవాస్తవాలు మాట్లాడుతున్నారని, రైల్వే అధికారులకు ప్రత్యామ్నాయ స్థలం చూపించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని, ముఖ్యమంత్రి జగన్ లిఖితపూర్వకంగా ఆర్ఆర్ పేట వాసులకు ఇచ్చిన హామీని నగరంలో ఉన్న అధికారులు అధికార పార్టీ నాయకులు అమలు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తూన్నారని, ఆర్ఆర్ పేట వాసులకు అన్యాయం చేయాలని చూస్తే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదని ఆర్ఆర్ పేట వాసులకు అన్ని రకాలుగా అండగా నిలబడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.కె.షాహీన, కొరగంజి రమణ, పొట్నూరి శ్రీనివాసరావు, బత్తుల వెంకటేష్, బావిశెట్టి శ్రీనివాస్, జగదీష్, పవన్ కళ్యాణ్, వెంకటేష్, నూకరాజు, మహేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.