రెక్కీ నిర్వహించడం ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి ప్రయత్నించడమే: సయ్యద్ నాగుర్ వలి

నకరికల్లు, జనసేన పార్టీ నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై కొంతమంది దుండగులు హత్య చేయడానికి రెక్కీ నిర్వహించడం చాలా దుర్మార్గమైన చర్యగా జనసేన పార్టీ తరపున భావిస్తున్నామని అన్నారు. విశాఖ పర్యటన నుంచి ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం చూస్తుంటే దీని వెనుక రాజకీయ నాయకుల కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రజల తరఫున రాజ్యాంగ బద్ధంగాప్రజలకు రావలసిన హక్కులపై అదేవిధంగా రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి అవినీతిపై మాట్లాడడమే పవన్ కళ్యాణ్ చేసిన తప్ప అని ప్రశ్నించారు, అత్యంత ప్రజాదారణ కలిగి ఒక పార్టీ అధ్యక్షుల వారికే భద్రత లేని ఈ వైసీపీ, తెరాస రెండు తెలుగు రాష్ట్రాల పరిపాలనలో ఇక సామాన్యుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ ఘటనపై సిబిఐ దర్యాప్తు చేసి తెరవెనుకున్న అసలు నిందితులను గుర్తించాలని పవన్ కళ్యాణ్ కి వెంటనే జడ్ క్యాటగిరి భద్రతను ఏర్పాటు చేయాలని, పవన్ కళ్యాణ్ పై చిన్న గీతపడ్డా ఎవర్ని వదిలే ప్రసక్తి లేదని, అది దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలని ఇప్పటివరకు జన సైనికుల యొక్క సహనాన్ని మాత్రమే చూశారని ఇలాంటి ఘటనలు పునరావృతమైతే జనసైనికుల యొక్క ఆక్రోశాన్ని చూడవలసి వస్తుందని హెచ్చరించారు.