జగనన్న కాలనీ మీద దోపిడి చేస్తున్న దగా ప్రభుత్వం

  • జగనన్న కాలనీ మీద దోపిడి చేస్తున్న దగా ప్రభుత్వం
  • ప్రభుత్వానికి పేద ప్రజలు అంటే ఎందుకింత వివక్ష
  • రోడ్డు కన్నా ఇంటి బేస్మెంట్ కిందకు ఉంది.. అది కూడా బాత్రూమ్ అంతా
  • చెరువులోని మట్టి తీసుకొచ్చి బేస్మెంట్లు పూడుస్తున్నారు..
  • పేద ప్రజలు మెరుగైన జీవితం అనుభవించకూడదు..
  • లోటట్టు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం..
  • ప్రజాధనాన్ని దోచుకుంటున్న వైసీపీ ప్రభుత్వం..
  • పశ్చిమ గోదావరి జిల్లాల అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు ఆరోపణ

ఏలూరు: నియోజకవర్గంలోని 14వ డివిజన్ పోనంగి గ్రామంలో ప్రభుత్వం ఇస్తున్న జగనన్న ఇళ్ళకాలనినీ మంగళవారం రెడ్డి అప్పలనాయుడు టౌన్ నాయకులు, వీరమహిళలతో కలిసి సందర్శించారు.. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ.. ఇది పేద ప్రజలకు ఇస్తున్న వైయస్సార్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే వాళ్లే ఈ రాష్ట్రంలో ఉన్న జిల్లా కాంట్రాక్టర్లను తీసుకొచ్చి నిర్వహిస్తున్నారు. కోనంగి గ్రామంలో ఉన్న 100 ఎకరాల చెరువులోని నల్ల మట్టిని తీసుకొచ్చి ఒక అడుగు బేస్మెంట్ పైన అడుగున్నర రాయితో కడుతున్నారు.. అది ధర్మకోల్ కంటే స్మూత్గా ఉంది.. పట్టుకుంటే పార్టులుగా విడిపోయేలా ఉంది.. నాణ్యతలేని సిమెంటుతో పేద వాళ్ళ ఇంటిని నిర్మిస్తున్నారు.. ఇచ్చిందే సెంటు ఇల్లు అది బాత్రూం అంతా.. రోడ్డు కన్నా ఇంటి బేస్మెంట్ కిందకు ఉంది.. ఈ చెరువులోని మట్టి తీసుకురావద్దని కలెక్టర్ గారు చెప్పినప్పటికీ కూడా కాంట్రాక్టర్లకు మేలు చేసే విధంగా లోకల్ గా ఉన్న ఎమ్మెల్యే చెరువులోని మట్టిని తీసుకొచ్చి బేస్మెంట్లు పూడుస్తున్నారు.. చెదలు పట్టి ఇదంతా పాడైపోయే పరిస్థితి.. ఇంటి పిల్లర్లకు, స్లాబ్ కు కనీసం 12 ఎం.ఎం ఐరన్ వాడాలి, కానీ 10 ఎం.ఎం వాడుతున్నారు. కిందకి చూస్తే 8 ఎం.ఎం తోనే పని కానిస్తున్నారు. ప్రభుత్వానికి పేద ప్రజలు అంటే ఎందుకు ఇంత వివక్ష. పేరుకు మాత్రమే ఇల్లు ఇచ్చారు. బలవంతంగా డ్వాక్రా మహిళల నుండి 30000 లాక్కొని వారే కాంట్రాక్టర్లకు ఇచ్చి కేంద్రం నుండి వచ్చే 18000 నిధులతో సరిపెట్టుకోండి.. మీ జీవితాలు దేహి అని చేయి చాచే స్థాయిలో ఉండండి.. పేద ప్రజలు మెరుగైన జీవితం అనుభవించకూడదు అనే ఆలోచనతో ఉంది ఈ ప్రభుత్వం. పేదవారి పక్షాన ఎందుకంత వివక్ష చూపుతున్నారు. ఇసుకలో, సిమెంట్ లో నాణ్యత లేదు.. అన్ని రకాలుగా పేద ప్రజలను వంచిస్తున్నారు. పేదవాళ్ల డబ్బుతో పేదవాళ్ళకి ఇచ్చే ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం ఏదైతే ఉన్నాయో గతంలో ఎస్సీ, ఎస్టీలను ఊరికి దూరంగా వెలివేసామని చెప్పేవారు. ఈరోజున టౌన్ లో ఉన్న పేద మధ్య తరగతి వర్గాల అందర్నీ గ్రేడ్ చేసి వాళ్లు ఊరికి ఎనిమిది పది కిలోమీటర్లు దూరంలో ఇళ్ళను వాళ్ళకు ఇచ్చి తస్మాత్ జాగ్రత్త. లోటట్టు ప్రాంతాల్లోనే నిర్మాణం చేసి అందులో కమిషన్లు కొట్టే పరిస్థితిని చూస్తున్నామని తీవ్ర ఆరోపణలు చేశారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీ చేస్తే అన్ని బయటకు వస్తుంది కానీ ఏ ఒక్క అధికారి మాట్లాడకుండా ప్రజా గొంతుకని నొక్కి బానిసలుగా మార్చేస్తున్నారు. దీర్ఘకాలంగా సంసారం సాగించే పేద ప్రజలు వారి జీవితం కడతేరే వరకు కూడా ఈ ఇంట్లో ఉండవలసిన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఇలాంటి నాణ్యతలేని ఇళ్లను కట్టి ఊరికే భూతద్దంలో చూపించి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందే తప్ప పేద ప్రజలకు మేలు జరగడం లేదని అన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల నాని గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏలూరు జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం అయ్యా మీరు ఇంట్లో కునకటం కాదు.. ఒకసారి వచ్చి ఇక్కడా ఏ రకంగా కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయో చూస్తే మీ కమిషన్లు కూడా పెంచుతారు. ఆ రకంగా అయినా మీరు వచ్చి పేద వాళ్ళ జీవితాలు ఏ విధంగా అభివృద్ధి జరిగిందో, మీరు ఎంత నాణ్యమైన కన్స్ట్రక్షన్లు చేయించారో మీరు వాళ్ళకు ఎంత అన్యాయం చేశారో మీ వల్ల ఎంత ప్రజలు నష్టపోతున్నారో మీకు తెలుస్తుంది.. ఒకసారి పరిశీలన చేయాలని జనసేన పార్టీ నుండి ఈ విధంగా డిమాండ్ చేస్తున్నామని అప్పల నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి కావూరి వాణిశ్రీ, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు, కుర్మా సరళ, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, 1 టౌన్ మహిళ ప్రెసిడెంట్ కోలా సుజాత, 2 టౌన్ మహిళ సెక్రటరీ తుమ్మపాల ఉమాదుర్గ,ప్రమీల రాణి, గిడుతూరి పద్మ, దుర్గా బీబీ, నాయకులు బోండా రాము నాయుడు, వీరంకి పండు, రెడ్డి గౌరీ శంకర్, పసుపులేటి దినేష్, బుధ్ధా నాగేశ్వరరావు, బాలు, నాని, హరీష్, పొన్నూరు రాము తదితరులు పాల్గొన్నారు.