రైతు రుణ మాఫీ వెంటనే అమలు చేయాలి – తగరపు శ్రీనివాస్

హుస్నాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రూ. లక్ష రుణ మాఫీని వెంటనే అమలు చేయాలని జనసేన పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందన్న ఆశతో చాలా మంది రైతులు వాటిని చెల్లించలేదు. దీంతో అసలు కంటే వడ్డీ అధికమై అప్పు పేరుకుపోయింది. మరియు పలువురి రైతుల ఖాతాలు హోల్డింగ్‌లో ఉండటం వలన రైతులు పెట్టుబడికి బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బుని తీసుకోడానికి వెళ్ళితే రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారని జనసేన పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీంతో రైతులకు బ్యాంకు మేనేజర్లు నోటీసులివ్వడం, ప్రభుత్వం మాఫీ చేస్తుందని రైతులు మేనేజర్లతో వాగ్వాదానికి దిగడం జరుగుతూ ఉంది. రైతుల రుణమాఫీకి ప్రభుత్వం హామీ ఇచ్చి నాలుగేళ్లయినా నేటికీ అమలుకు నోచుకోలేదు. 2018 సాధారణ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రచారంలో భాగంగా రూ.1లక్ష వరకు రుణామఫీ చేస్తామని హామీ ఇవ్వడమే గాక ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపర్చారు. ఆ తరువాత ఏటా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లలో సైతం రుణమాఫీపై ప్రకటనలు చేయడం తప్ప అమలు చేయలేదు. తొలుత రూ.25వేలు, ఆ తర్వాత రూ.50 వేలలోపు, అనంతరం రూ75వేలలోపు, చివరిదశలో రూ1లక్షవరకు రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగేళ్లయినా స్పందించని ప్రభుత్వం. బ్యాంకుల్లో పేరుకుపోతున్న వడ్డీ, కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు వెనకడుగు వేయడం, పలువురి రైతుల ఖాతాలు హోల్డింగ్‌లో ఉండటం వలన రైతులు పెట్టుబడికి బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బుని తీసుకోడానికి వెళ్ళితే రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా అమలు చేస్తాం అని చెప్పిన రుణమాఫీనీ అమలు చేయాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ మరియు మండల అధ్యక్షులు మల్లెల సంతోష్, ఉపాధ్యక్షులు కొలుగూరి అనిల్, ప్రధాన కార్యదర్శి గాలిపెల్లి వినోద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వొద్దమల్ల విజయ్, పొడిశెట్టి విజయ్, మొలుగూరి అరవింద్, వొద్దమల్ల అజయ్ తదితరులు పాల్గొన్నారు.