ఈ జన్మకి జగనన్న ఇళ్ళు పూర్తయ్యే జాడ కనపడటం లేదు

  • జగనన్న ఇళ్ళ వివరాలు కోరిన జనసేన నాయకులు

కాకినాడ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అక్కచెల్లెమ్మల కేరింతల నడుమ ప్రారంభించిన జగనన్న కాలనీల యదార్థ స్థితి తెలుసుకోవడం కోసం జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇన్ ఛార్జ్ ముత్తా శశిధర్ ఆలోచనలతో కాకినాడ నగర జనసేన పార్టీ నాయకులు శుక్రవారం జిల్లా ప్రధాన హోసింగ్ అధికారిని వివరాలకోసం కలవడం జరిగింది. ఈ సందర్భంగా సిటి ఉపాధ్యక్షుడు అడబాల సత్యన్నారాయణ మాట్లాడుతూ.. ఈ వై.సి.పి ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ప్రజలను మోసం చేస్తోందనీ, రాబోయే ఎన్నికలవేళ లబ్ది పొందేందుకు వై.సి.పి కుట్ర అని, ఈ జన్మకి జగనన్న ఇళ్ళు పూర్తయ్యే జాడ కనపడటం లేదని, జనసేన పార్టీ ఆరోపించింది. ఇంకోపక్క లబ్దిదారులు లోనులకి వాయిదాలు కట్టడం మొదలయ్యిందంటున్నారనీ లబ్దిదారులు వాపోతున్నారని ఇదేమి నిర్లక్ష్యం అని వై.సి.పి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. గతంలో ఈ పధకం ప్రారంభించినప్పుడు కాకినాడ సిటీ పరిధిలోని ప్రతి లబ్ది దారునికి సిటీ పరిధిలో ఒక సెంటు భూమి ఇస్తాము అని నమ్మబలికి, పక్క నియోజకవర్గంలో స్థలాన్ని కేటాయించారు. అలాగే పధకం చేపట్టే లే అవుట్లలో రోడ్లు, విద్యుత్, తాగునీరు, పాఠశాలలు, అంగన్ వాడీలు, ఉద్యానవనం, సచివాలయం, విలేజ్ క్లినిక్ తదితర సామాజిక అవుసరాలతో పాటు ఇంటి నిర్మాణం చేసుకొనుటకు మూడు ఆప్షన్లు ప్రకటించడం జరిగిందనీ, ఈ విషయమై అధికారులని కలసి కాకినాడ సిటీ నియోజకవర్గ పరిధిలో మొత్తం నిర్మాణంలో ఉన్న ఇళ్ళు ఎన్ని మరియు ఏఏ ఆప్షన్ ప్రకారం ఎన్ని ఇళ్ళు కడుతున్నారు, గృహఋణము మంజూరు అయిన వాటి నిర్మాణముల పురోగతి ఏస్థాయివరకు జరిగినది మరియు పూర్తి అయిన గృహములను యే తేదీనాటికి లబ్దిదారులకు అందచేసే ప్రణాళిక జరిగినదో తదితర వివరాలు అన్నీ వ్రాత పూర్వకంగా జనసేన పార్టీ అడగడం జరిగింది. గౌరవ అధికారులు వెంటనే స్పందించి త్వరలో అన్ని వివరాలు ఇస్తాము అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రెటరీ అట్ల సత్యనారాయణ, సిటీ ఉపాధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, సిటీ సెక్రెటరీ వీరబాబు,
కంట రవిశంకర్, సమీర్, వార్డునాయకులు సుంకర సురేష్, ఆకుల శ్రీనివాస్, దుర్గ ప్రసాద్, తోట కుమార్, బుల్లెట్ భగవాన్, సుంకర రామకృష్ణ, అగ్రహారం సతీష్, మనోహర్లాల్ గుప్తా మావులూరి సురేష్, చీకట్ల వాసు, దారపు సతీష్, వాసిరెడ్డి సతీష్ (ధోని), బట్టు లీల తదితరులు పాల్గొన్నారు.