యు.పి.హెచ్.సి ఆఫీస్ నందు వాటర్ డిస్పెన్సెర్ ను ఏర్పాటు చేసిన శివ్ వడ్లమూడి

విశాఖపట్నం: కృష్ణా కాలేజీ ఎదురుగా ఉన్న యు.పి.హెచ్.సి ఆఫీస్ నందు ఆప్ సబ్ కీ ఆవాజ్ సంస్థ ప్రెసిడెంట్ శివ్ వడ్లమూడి ప్రజల వినియోగార్ధం బ్లూ స్టార్ వాటర్ డిస్పెన్సెర్ (హాట్ & కోల్డ్) ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆప్ సబ్ కీ ఆవాజ్ సంస్థ సెక్రెటరీ బావిశెట్టి కిరణ్ కుమార్ ప్రతినిధులు రవితేజ, కొమ్ముల బార్ఘవ్ వంశీ, పోలిశెట్టి సూర్యప్రకాష్, సుబ్బు విశ్వనాధం, నాని కొమ్మిరిశెట్టి, పోషకుడు వీరేశ్వర రావు, కొండేటి భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన 16వ వార్డు కార్పొరేటర్ ముళ్ల అప్పారావు మాట్లాడుతూ.. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆప్ సబ్ కీ ఆవాజ్ సంస్థ ప్రెసిడెంట్ శివ్ వడ్లమూడిని అభినందించారు. వాటర్ డిస్పెన్సెర్ అందించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.