మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుదాం: గురాన అయ్యలు

విజయనగరం: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములవుతూ మట్టి గణపతులనే పూచించాలని జనసేన నేత గురాన అయ్యలు పేర్కొన్నారు.
స్థానిక జీఎస్ఆర్ హోటల్ వద్ద గురువారం స్పార్క్ సొసైటీ ఆధ్వర్యంలో వినాయక మట్టి విగ్రహలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన గురాన అయ్యలు మాట్లాడుతూ జనసేన సిద్ధాంతాల్లో ముఖ్యమైన సిద్దాంతం పర్యావరణ పరిరక్షణ అని, ప్రజలు బాగుంటేనే సమాజం బాగుంటుందని, సమాజం బాగుండాలంటే ప్రజలందరూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని అన్నారు. నింగి, నీరు, నేల, నిప్పు, గాలితో సమ్మిళితమైన పర్యావరణాన్ని పరిరక్షించుకున్నప్పుడే మానవజాతి శోభిల్లుతుందని పేర్కొన్నారు. రంగు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మల నిమజ్జనం వలన జల కాలుష్యం జరిగి, జల జీవరాశులకు తీవ్ర హాని కలిగిస్తుందన్నారు. కావున చెరువుల పరిరక్షణ కోసం అందరూ మట్టి బొమ్మలు వాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్పార్క్ సొసైటీ ప్రతినిధి పద్మనాభం, డి.రామచంద్రరాజు, కాటం అశ్వీని, మాతా గాయిత్రి, పుష్ప, లక్ష్మీ, జ్యోతి, చక్రవర్తి, ఎల్ రవితేజ, పిడుగు సతీష్, రవీంద్ర, నారాయణరాజు, ఎమ్ పవన్ కుమార్, వజ్రపు నవీన్ కుమార్, పృథ్వీ భార్గవ్, సయిద్ బొకారి, దుర్గారావు, సురేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.