దమ్మాలపాడులో ఘనంగా వినాయక నిమర్జన వేడుకలు

సత్తెనపల్లి: దమ్మాలపాడు గ్రామంలో వినాయకుని నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలలో భాగంగా ముందుగా స్వామివారి యొక్క మహా ప్రసాదం లడ్డును వేలంపాట నిర్వహించగా ఆ వేలం పాటలో 21 కేజీ లడ్డును బుర్ల రామకృష్ణ వినాయకుని మహా ప్రసాదం లడ్డూనువేలం పాటలో దక్కించుకున్నారు. అలాగే స్వామివారి 5కేజీల లడ్డును లక్కీ డ్రాలో దక్కించుకున్న అత్తంటి తిరుమల రాయుడు. ఈ సందర్భంగా ముప్పాళ్ళ జనసేన పార్టీ మండల అధ్యక్షుడు సిరిగిరి పవన్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలందరూ కూడా పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ఆశీస్సులు ప్రజలందరికీ ఇవ్వాలని అలాగే ఈ సైకో ప్రభుత్వం పోయి జనసేన ప్రభుత్వం రావాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఆ భగవంతుడిని వేడుకున్నట్టు గ్రామ ప్రజలు తెలిపారు.