మదనపల్లిలో జనసేన విస్తృతస్థాయి సమావేశం

మదనపల్లి: కమ్మవీధిలో జనసేన పార్టీ జనసేన జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి మరియు మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా సంయుక్త ఆధ్వర్యంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలతో కలసి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ అదోగతి పాలు అవుతున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు భారతదేశ వేరే రాష్ట్రాల ముందు చులకన అయిపోతున్నారు అభివృద్ధి సూన్యం ఉంది ఏ మాత్రం సంక్షేమ పథకాల కార్యక్రమాలు జరగడం లేదు 10 శాతం అభివృద్ధి జరుగుతుంటే 90 శాతం డబ్బా మాటలు జరుగుతున్నాయి. ఈ రోజు ఈ రాష్ట్రానికి వైస్సార్సీపీ ప్రభుత్వం పాలన చేసే అర్హత ఏ మాత్రం లేదని అన్నారు. మా ఇసుక మాకే అమ్ముతారు మా భూములు కబ్జా చేసి మా భూములు మాకే అమ్ముతారు. సారాలో స్పిరిట్ కలిపి మా దగ్గరే తాగించేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దలు పవన్ కళ్యాణ్ గారు నేను తెలుగుదేశం పార్టీ సైతం కలసి నడిస్తేనే ఈ రావణాసురుడుని వధ చేయగలం అని అన్నారు. గంగారపు రాందాస్ చౌదరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంకి ఎదురు తిరిగి ముఖ్యంగా మదనపల్లి ఎమ్మెల్యే మీద వీరోచితంగా పోరాడి ఈ రోజు మగాడు అనిపించుకొన్న చీకలుబైలు సర్పంచ్ ప్రభాకర్ అభినందించారు. పదవులు అధికారం శాశ్వతం కాదు రాష్టంలో సైకో జగన్మోహన్ రెడ్డి కక్షగట్టి ప్రతిపక్షలను అనగాదొక్కతాన్నడో మదనపల్లిలో కూడా శాసన సభ్యడు కక్ష్య కట్టి తెలుగుదేశం కార్యకర్తలను గాని జనసేన పార్టీ కార్యకర్తలను గాని ఈ నాలుగున్నర సంవత్సరాలుగా అనేక రకాలుగా హింసించడం జరిగిందని అన్నారు. ఈ రోజు జనసేన పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జైల్లో మగ్గుతా ఉన్నారు. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర అనుభవం ఉన్న దేశంలోనే కాదు ప్రపంచంలోనే పేరుగాంచిన చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసు పెట్టి అరెస్టు చేశారని, జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేస్తే ఆయన పేరు చెప్పుకుని 43000 కోట్లు అవినీతి చేశారని ఎల్ఫోర్స్మెంట్ సిబిఐ కేసులు పెడితే చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఐదు సంవత్సరాలు విభజన ఆంధ్ర ప్రదేశ్ వాళ్ళ మామ ఎన్టీ రామారావు గారు 6 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన 370 కోట్ల అవినీతి చేశారని అంటున్నారు. 43 వేల కోట్లు ఎక్కడ అది చేయరు నేరం అని అన్నారు. మళ్లీ కొత్తగా లోకేష్ బాబు గారి మీద కూడా కేసు అంటున్నారు. అవుటర్ రింగ్ రోడ్డు మీరే చెప్పారు అక్కడ అమరావతి లేదని స్మశానమని గ్రాఫిక్స్ అని నోటికి వచ్చినట్లు మాట్లాడాతారు. ఈ రోజు ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలని పన్నాగాం పొందుతాన్నారు అని అన్నారు. అందుకని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్నారు. ఆరోజు రాజమండ్రిలో చంద్రబాబునాయుడు గారితో ములాకత్ తీసుకున్న తర్వాత బయటకు వచ్చి ఒక పెద్ద మనసు చేసుకొని పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జనసేన పార్టీ కోసం కాదు తెలుగుదేశం పార్టీ కోసం కాదు పవన్ కళ్యాణ్ కోసం కాదు చంద్రబాబు నాయుడు కోసం కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల క్షేమం కోసం జనసేన టిడిపి పార్టీలు కలిసి పనిచేస్తాయని ప్రకటించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాసాగర్, గంగారపు నవీన్ కుమార్, గౌతమ్ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రాష్ట చేనేత విభాగ నాయకులు అడపా సురేంద్ర, టౌన్ ప్రెసిడెంట్ నాయని జగదీష్, మండల అధ్యక్షులు గ్రానైట్ బాబు, కుమార్, రెడ్డెమ్మ చంద్రశేఖర్, గడ్డం లక్ష్మీపతి, బాలు స్వామి, కొత్తపల్లి ఎంపీటీసీ దేవేంద్ర, చీకలబయలు సర్పంచ్ ప్రభాకర్, జనార్దన్, అర్జున, మోహన్ కృష్ణ, లవన్న, నాగవేణి, శంకర, నవాజ్, అఫ్రోజ్, నారాయణ స్వామి, జనసేన, టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.