మన కులాన్ని ప్రేమిద్దాం- ఇతర కులాలను గౌరవిద్దాం

  • కాపులు పెద్దన్నయ్య పాత్ర పోషించాలి
  • కులాలను కలిపే విధానంతోనే రాజ్యాధికారం సాధ్యం
  • కాపు సంక్షేమ సేన ఆత్మీయ సమావేశంలో జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి: కులాలను కలిపే విధానంతోనే రాజ్యాధికారం సాధ్యమని జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఉద్ఘాటించారు. బుధవారం “బాస్” కార్యాలయంలో జరిగిన కాపు సంక్షేమ సేన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో వివిధ పదవుల్లో నియమితులైన వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపులు పెద్దన్నయ్య పాత్ర పోషించాలన్నారు. అన్ని సామాజిక వర్గాలను కలుపుకుపోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ కులాన్ని ప్రేమించాలని, ఇతర కులాలను గౌరవించాలన్నారు. అన్ని సామాజిక వర్గాల్లో ఉన్న మంచిని చూసి నేర్చుకోవాలన్నారు. ఏ కులాన్నీ ధ్వేషించవద్దు, దూషించవద్దన్నారు. పదేళ్ల ముందు ఒక్కడిగా ప్రధానమంత్రి పక్క కూర్చున్న పవన్ కళ్యాణ్… పదేళ్ల తరువాత బలమైన శక్తిగా ఎదిగి మళ్లీ అదే ప్రధాన మంత్రి పక్కన కూర్చున్నారన్నారు. సాక్షాత్తు ప్రధాన మంత్రే పవన్ కళ్యాణ్ ను సోదరుడుగా సంబోధించడం సంతోషించదగ్గ విషయమన్నారు. రాజ్యాధికారం చూడని సామాజిక వర్గాలను అధికారంలో కూర్చో బెట్టేందుకు కాపులు పెద్దన్నయ్య పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ కాపు సంక్షేమ సేన, బత్తిన మధు బాబు , రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ ఆనంద్, తిరుపతి జిల్లా అధ్యక్షులు,హిమవంతు రాయల్, తిరుపతి జిల్లా జనరల్ సెక్రెటరీ వెంకట రాయల్ తిరుపతి జిల్లా కార్యదర్శి కాకర్ల హేమంత్ , తిరుపతి నగర అధ్యక్షుడు వంశి, తిరుపతి నగర కార్యదర్శి పురుషోత్తం ,తిరుపతి జిల్లా కార్యదర్శి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.