మురుగు కాలువల్లో పూడికలు తీయించండి…!

  • దోమల నివారణ చర్యలు చేపట్టండి
  • ప్రజలు రోగాల భారిన పడుతున్నారు
  • జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు

పార్వతీపురం మున్సిపాలిటీలో మురుగు కాలువల్లోని మురుగు తొలగింపు చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు కోరారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు కలిసి పార్వతీపురం మున్సిపాలిటీలోని మురుగు కాలువల సమస్యపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా మున్సిపాలిటీలోని మురుగు కాలువల్లో మురుగు తొలగింపు చర్యలు లేకపోవడంతో, కాలువల్లో చెత్త పేరుకుపోయి దుర్గంధం వ్యాపింప చేస్తున్నాయన్నారు. వీటితోపాటు దోమలు, ఈగలు చేరి ప్రజలు రోగాల భారిన పడుతున్నారన్నారు. సీజన్ కాని సీజన్ లో పట్టణంలో ప్రజలు రోగాల భారిన పడుతున్నారని తెలిపారు. కాబట్టి 30 వార్డుల్లోని మురుగు కాలువల్లో మురుగు తొలగింపు చర్యలతో పాటు దోమల నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. అన్ని వార్డుల్లో ఫాగింగ్ కార్యక్రమం చేపట్టాలన్నారు. అనంతరం వినతి పత్రాన్ని అందజేశారు.