Yemmiganur: దిగజారుడు రాజకీయాలు చేస్తారా…? జనసేన పార్టీ

ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని కె తిమ్మాపురం గ్రామంలో జరుగుతున్న గ్రామ పంచాయితీ ఎన్నికలలో జనసేన పార్టీ కార్యకర్తలు తమ పార్టీ అభ్యర్థి పోటీలో లేనిచో మిత్రపక్షమైన బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తాము తప్ప ఇతర పార్టీల నుంచి పోటీ చేసిన వ్యక్తులకు కాదని ఎమ్మిగనూరు మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్ రాష్ట్ర చేనేత వికాస్ కార్యదర్శి కాసా రవి ప్రకాష్ తెలిపారు, గురువారం రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ జనసేనపార్టీలో ఎటువంటి హోదా లేకున్నా అభిమానం ముసుగులో ఇతర పార్టీ వారికి ఓటు వేయమని కొందరు బహిరంగంగా కోరుతూ దిగజారుడు రాజకీయాలు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు, పోటీ చేసి ప్రజలను ఓట్లు అడగాలి తప్ప ఇతర పార్టీ వ్యక్తులను ప్రోత్సహించేలా కార్యకర్తలను ఓట్లు వేయమని చెప్పడం సిగ్గుచేటన్నారు. అధినేత ప్రకటించిన ఇంచార్జికి తెలియకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని అభిమానం ముసుగులో పార్టీ ప్రతిష్టను, దెబ్బతీయాలని ప్రయత్నాలు చేస్తున్నావారిని కార్యకర్తలు గమనించాలని కోరారు. వ్యక్తిగత నిర్ణయాలతో పార్టీ పేరును వాడుకుంటే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కె తిమ్మాపురం గ్రామ పంచాయితీ ఎన్నికలలో జనసేన బీజేపీ పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్న వారికి మాత్రమే కార్యకర్తలు సహకరించాలని కోరారు, లేనిచో ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధులుగా ప్రజల ముందుకు వెళ్లినా వారిని హర్షిస్తామని… అలా కాదని జనసేన నాయకులమని చెప్పి పార్టీ పేరు వాడుకొని ఇతర పార్టీలు బలపరిచిన వ్యక్తులకు ఓటు వేయమంటే ఎందుకు ఓటు వేయమని అడుగుతున్నారో ప్రతి జనసేన కార్యకర్త ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా వుందని అన్నారు, ఈ కార్యక్రమంలో షబ్బీర్ వినయ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.