నేడు భారత్ – చైనా మధ్య పదో విడత చర్చలు.. కీలక విషయాలపై భేటీ..

న్యూఢిల్లీ: భారత్‌-చైనా దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు ఇరుదేశాల సైనిక అధికారులు పదో విడుత సమావేశం కానున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు చైనా భూభాగంలోని మాల్డో పోస్టు వద్ద సీనియర్‌ కమాండర్‌ స్థాయి అధికారులు సమావేశమవనున్నారు. ఇప్పటికే పాంగాంగ్‌ నదికి ఉత్తర, దక్షిణ భూభాగాల నుంచి బలగాల ఉపసంహరణ జరుగుతున్నది. ఈనేపథ్యంలో సరిహద్దుల్లోని మరిన్ని ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియపై ఇరు దేశాల సైన్యాధికారులు చర్చించనున్నారు. అదేవిధంగా దేశ్‌పాంగ్‌, హాట్‌ స్ప్రింగ్స్‌, గోర్గాలో బలగాల వెనక్కితీసుకునే అంశం చర్చకు రానుంది.

గత నెల 24న జరిగిన తొమ్మిదో దఫా కమాండ్ స్థాయి చర్చలు సత్ఫలితాలను ఇచ్చాయి. ఆ చర్చలు ఫలించడంలో ప్రస్తుతం రెండు దేశాల సైనిక బలగాలు వెనక్కి వెళ్లాయి. దీనికి సంబంధించిన ఫొటోలను భారత సైన్యం విడుదల చేసింది. హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, దేప్సంగ్ ప్లెయిన్స్ వంటి ప్రాంతాల్లో కూడా సైనిక బలగాల ఉపసంహరణకు సంబంధించి ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది.