కరోనా టీకాలు వేయడంలో భారత్ రికార్డు

ఢిల్లీ: కరోనా టీకాలు వేయడంలో భారత్ రికార్డు సృష్టించింది. కేవలం 34 రోజుల్లోనే కోటి మందికి పైగా టీకాలు వేసింది. కరోనా కట్టడి కోసం జనవరి 16వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా కరోనా టీకాలు వేస్తున్నారు. తొలి విడతలో ఆరోగ్య కార్యకర్తలకు టీకాలు వేశారు. రెండో విడత టీకాల కార్యక్రమం కూడా ప్రారంభమైంది. అయితే టీకాలు వేసే విషయంలో భారత్ కంటే ముందు అమెరికా ఉంది. అమెరికా 31 రోజుల్లోనే కోటి మందికి పైగా టీకాలు వేసింది. అమెరికా తర్వాతి స్థానంలో భారత్ నిలిచింది. మూడో స్థానంలో బ్రిటన్ ఉంది. బ్రిటన్ లో 56 రోజుల్లో కోటి మందికి టీకాలు వేశారు. కరోనా నియంత్రణకు భారత్ తీసుకుంటున్న చర్యలు ప్రపంచ దేశాల మన్ననలను పొందుతున్నాయి.