వైసీపీకి చమర గీతం పాడే రోజులు దగ్గరపడ్డాయి

  • వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు విసిగెత్తారు
  • రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జి మలిశెట్టి వెంకటరమణ

రాజంపేట: వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని ప్రజలు విసిగిత్తిపోయారని వైసిపికి చమర గీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని రాజంపేట జనసేన పార్టీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని తాటి గుంటపల్లె పంచాయతీ సీతంపేట, కుమ్మరపేట పలు గ్రామాలలో 130వ రోజు పవనన్న ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేస్తూ, వాటిని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలోని ప్రజలు జనసేన తెలుగుదేశం పార్టీకి ప్రజలు నీరాజనాలు అర్పిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజలు జగన్ రెడ్డి పరిపాలన విసుగెత్తి ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారన్నారు. రాష్ట్రంలోఏ ఒక్క కంపెనీ కూడా రాకుండా చేశారన్నారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 10 లక్షల కోట్లు అప్పుచేసి ప్రజల మీద తలభారం మోపి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. అంగన్వాడి కార్యకర్తలు గత ఎనిమిది రోజులు నుండి తమ డిమాండ్లను నెరవేర్చాలని సమ్మె చేస్తూ, ఉంటే సచివాలయ సిబ్బంది ద్వారా అంగన్వాడి కేంద్రాల తాళాలను పగలకొట్టి సచివాల సిబ్బంది ద్వారా సెంటర్లను నడపాలనడం దుర్మార్గమన్నారు. సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం కవ్వింపు చర్యకు దిగటం దుర్మార్గమన్నారు. ఇచ్చిన హామీలు చేయకపోవడం వల్లే అంగన్వాడీలు సమ్మెకు దిగాల్సి వచ్చిందన్నారు. 7 రోజులుగా సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం రాష్ట్రంలో నిధులు లేవని చెప్పి తప్పించుకోవడం సరికాదన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తగదన్నారు. 2024 ఎన్నికల్లో ఎక్కడ అన్యాయం, అక్రమాలు జరిగినా ప్రజలే వాలంటీర్లుగా మారాలన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీని ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, భాస్కర్ పంతులు, జయరాజు, సాంభశివయ్య, జనసేన వీర మహిళలు జడ్డా శిరీష, సుభాషిని, వరలక్ష్మి, గీతామాధురి తదితరులు పాల్గొన్నారు.