ప్రముఖ గాయని సునీత ఫిర్యాదు మేరకు నిందితుడి అరెస్ట్

ప్రముఖ గాయని సునీత పేరు ఉపయోగించుకొని డబ్బులు వసూలు చేస్తున్న ఓ యువకుడిని సైబర్‌ క్రైం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురానికి చెందిన చైతన్య అనే యువకుడు సునీత అభిమానిగా చెప్పుకొంటూ సామాజిక మాధ్యమాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించాడు. ఆమె పేరుపై స్వచ్ఛంద సేవ చేస్తానంటూ వసూళ్లకు పాల్పడ్డాడు. సునీత పేరు మీద నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచాడు. ఈ విషయంపై సునీత పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టి  అరెస్టు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురానికి చెందిన చైతన్య అనే యువకుడు తెలుగు చిత్రాలకు పాటలు పాడి.. మంచి పేరు తెచ్చుకోవాలనుకున్నాడు. యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. పెద్దగా ఫలితం రాలేదు. ఒకేసారి పేరొచ్చేలా గాయని సునీత పేరిట సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టించి, ఆమె బంధువు, మేనేజర్‌, తోటి గాయకుడిగా పరిచయం చేసుకున్నాడు. ఆమె అభిమానులను బురిడీ కొట్టించి అందినoత దండుకున్నాడు.