వ్యవసాయ క్షేత్రంలో పవన్ కళ్యాణ్ సంప్రదాయబద్ధంగా కనుమ వేడుకలు
కష్టపడి పండించిన పంట చేతికొచ్చే వేళ సంతోషంతో చేసుకొనే వేడుకలు సంక్రాంతి. ప్రతి రైతు ఇంటా పాడిపంటలకు తోడ్పడిన జంతువులను గౌరవించే పర్వదినం కనుమ.. ప్రజలందరికీ భోగ భాగ్యాలు, సుఖ సంతోషాలు సిద్ధించాలని ఆకాంక్షిస్తూ.. కనుమ శుభాకాంక్షలు’ తెలిపారు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మంగళవారం హైదరాబాద్ లోని వ్యవసాయ క్షేత్రంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంప్రదాయబద్ధంగా కనుమ వేడుకలు నిర్వహించారు. గోపూజ చేశారు. పశువులకు మేత అందించారు.
![](https://janasenanewssletter1.blob.core.windows.net/images/8329f4b7-eba5-4005-a5c9-df5d50f87d5d.jpeg)