ఓటిటి, సోషల్ మీడియా, డిజిటల్‌కి కొత్త రూల్స్

ఓటిటి, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో నియంత్రణకు కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్టు కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్ స్పష్టంచేశారు. మూడు అంచెల నియంత్రణ విధానం కోసమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రులు తెలిపారు. ఓటిటిలో అసభ్య, అశ్లీల, హింసాత్మక అంశాలకు సంబంధించిన కంటెంట్‌పై నిషేధం విధించినట్టు కేంద్ర మంత్రులు వెల్లడించారు. ఓటీటీలో ప్రసారం అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ కంటెంట్‌ను వయస్సు ఆధారంగా 5 విభాగాలుగా విభజించారు.

సామాజిక ఉద్రిక్తతలకు దారితీసే కంటెంట్‌పై నిషేధం విధించినట్టు చెప్పిన కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్.. సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే అంశాల పట్ల కేంద్రం కఠినంగా వ్యవహరించనున్నట్టు స్పష్టంచేశారు.

OTT, Social media ప్లాట్‌ఫామ్స్‌ నిర్వహణకు సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయాలు క్లుప్తంగా..

జాతి సమగ్రత, సమైక్యతను దెబ్బతీసేలా ఉండే అంశాలపై నిషేధం కొనసాగింపు.

సోషల్ మీడియాలో Fake news పై కఠిన ఆంక్షలు.

మహిళలు, చిన్నారులు, దళితులను కించపరిచేలా ఉండే అంశాలపై నిషేధం విధింపు.

ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే Fake news content ను సైట్స్, సోషల్ మీడియాలోంచి తొలగించాలి.

ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించే అధికారులు 24 గంటలు దర్యాప్తు సంస్థలకు అందుబాటులో ఉండాల్సిందిగా సూచించిన కేంద్రం.