జనసేనలోకి డి.ఆర్.డి.ఎ ఉన్నతాధికారి
- పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న శ్రీనివాసరాజు
రాజంపేట: డి.ఆర్.డి.ఏ మాజీ చీప్ అకౌంట్స్ ఆఫీసర్ యల్లటూరు శ్రీనివాసరాజు శనివారం మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాజంపేట నుండి శనివారం అత్యధిక వాహనాలు, వండలాది మంది కార్యకర్తలతో భారీగా మంగళగిరికి తరలి వెళ్లి అధినాయకుడి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారి అయిన యల్లటూరు వంటి వ్యక్తి పార్టీలోకి రావడం శుభ పరిణామమని తెలియజేస్తూ కండువా కప్పి శ్రీనివాసరాజును పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా శ్రీనివాసరాజు మాట్లాడుతూ ప్రజలకు సేవలందించాలన్న సంకల్పంతో రాజకీయ అరంగేట్రం చేయడం జరిగిందని తెలిపారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, భావజాలాలు తనను ఆకర్షించాయని.. ప్రజాసేవకు తనకు సరైన వేదిక జనసేన పార్టీయేనని తెలిపారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని సైనికుడిలా పని చేస్తానని అన్నారు. రానున్న సావిత్రిక ఎన్నికలలో నియోజకవర్గంలో జనసేన జెండా ఎవరు వేయడమే లక్ష్యంగా కృషి చేస్తానని అన్నారు. శ్రీనివాసరాజు తండ్రి వెంకటరాజు సర్పంచ్ గా, సోదరుడు శివరామరాజు నందలూరు మండల ఉపాధ్యక్షులు గాను, జెడ్పిటిసి సభ్యులుగాను ప్రజలకు సేవలందించారు. ఇలా ఆది నుంచి శ్రీనివాసరాజుకు రాజకీయ నేపథ్యం కలిగి ఉండడమే కాక, తన ఉద్యోగ జీవితంలోనూ రాష్ట్ర స్థాయిలో మెండుగా పరిచయాలు కలిగిన వ్యక్తిగా, నియోజకవర్గంలో అందరికీ సూపరిచితుడిగా మంచి ప్రస్థానం ఉంది. ప్రజాసేవ కోసం రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారాన్ని సైతం వదులుకొని నాలుగు సంవత్సరాల ముందే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసి నియోజకవర్గంలోని ఆరు మండలాల నాయకులను కలుపుకుంటూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ మరోవైపు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల సాధనకు కృషి చేస్తూ, అవసరమైన వారికి చేయూతనిస్తూ అనతి కాలంలోనే అందరివాడుగా పేరు తెచ్చుకున్న ఆయన తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గంలో జెండా పాతుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.