ప్రేమ సమాజం ఆశ్రమంలో ఘనంగా డా. మిడతాన జన్మదిన వేడుకలు

  • నిజమైన అనాధలు తల్లిదండ్రులని వదిలేసి వెళ్లిన కొడుకు కూతుళ్లే డా. రవికుమార్ మిడతాన

విజయనగరం: రవి చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ మరియు జనసేన పార్టీ విజయనగరం జిల్లా నాయకులు డా.మిడతాన రవికుమార్ జన్మదిన వేడుకలు విజయనగరం టౌన్ లో ప్రేమ సమాజం ఆశ్రమంలో ఘనంగా గురువారం మధ్యాహ్నం జరిగాయి. ప్రేమ సమాజంలో ఉన్న అవ్వలు, తాతలు మధ్య జరిగాయి. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ఇలా ఈ పుట్టినరోజుని తల్లిదండ్రులని అనాధలు చేసిన కొడుకు, కూతుళ్లు నిజమైన అనాధలుగా నేను భావించను, ఇలా ఈ పుట్టినరోజు వీళ్ళందరూ మధ్య భోజనం సమయంలో ఇలా కూర్చొని మాట్లాడి వాళ్లతో గడపడం చాలా సంతోషకరమైన సందర్భం. నా జీవితంలో ఇలా ప్రతి ఏటా నా పుట్టినరోజుకి పలు ఆశ్రమంలో అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఇలా ఏర్పాటు చేయడం నాకు చాలా సంతృప్తి అన్నారు.