జనస్వరం క్యాలెండర్ ఆవిష్కరణ

ఎమ్మిగనూరు: జనస్వరం క్యాలెండర్ ను జనసేన పార్టీ నాయకులు రాహుల్ సాగర్ మరియు బజారి నాయుడు కలగట్ల మరియు తిమ్మాపురం గ్రామంలో క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీకి మీడియా పరంగా ఎంతో సహాయ సహకారం అందిస్తున్న పత్రిక జనస్వరం అని, జనసేన పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం ఎక్కడ జరిగినా పూర్తిస్థాయిలో కవరేజ్ ఇవ్వడంలో జనస్వరం పత్రిక ముందు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రషీద్, జమప వేరంజి రామాంజనేయులు, అశోక ఉరుకుందు, లింగప్ప, నర్సప్ప తదితరులు పాల్గొన్నారు.