గాజువాక 75వ వార్డులో జనసేనలో భారీ చేరికలు

గాజువాక, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో హరిజనులకు, దళితులకు పెద్ద పీట వేస్తారని ఆశిస్తూ జనసేన పార్టీ రాష్ట్ర పిఏసి సభ్యులు, గాజువాక నియోజవర్గ ఇంచార్జ్ కోనతారావు ఆధ్వర్యంలో 75వ సీనియర్ నాయకులు అంజూరి దీపక్ సమక్షంలో 60 మంది జనసేన పార్టీలో చేరారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు జనసేన లోకి చేరికలు జరుగుతున్నాయని అన్నారు. గడిచిన 5 ఏళ్ల వైసిపి పాలనలో ఎస్సీ/ఎస్టీలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని, ఎస్సీ/ఎస్టీ కార్పొరేషన్, ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ నుంచి వచ్చే నిధులు వారికి కేటాయించకుండా వైసిపి పథకాలకు దారి మల్లిచారని దుయ్యబట్టారు. దళారీలకు తప్ప సామాన్య ప్రజలకు అందాల్సిన ఎస్సీ/ఎస్టీ రాయితీలు అందటంలేదని, స్వయం ఉపాధి పథకాలు ఆగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా దళితులపై తీవ్రమైన దాడులు జరుగాయని, పవన్ కళ్యాణ్ గారికి అధికారం ఇస్తే అన్ని విధాలుగా తమను ఆదుకుంటారనే నమ్మకంతో జనసేనలో చేరినట్లు తెలిపారు. అన్ని వర్గాలకు స్వేచ్చ కల్పిస్తూ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా వారికి నైపుణ్యాన్ని పెంపొందించి ఉపాధి అవకాశాలు కల్పన కు కృషి చేస్తూ ఆర్థికాభివృద్ధికి తోడ్పడతామని కోన తాతారావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఇందల వెంకట రమణ, కోన చిన అప్పారావు, దాసరి జ్యోతి రెడ్డి, ములకలపల్లి వంశీ, నామాల అర్జున్, కరణం కనకారావు, లంక లతా, గవర సోమశేఖర్, కాద శ్రీను, బలిరెడ్డి అరవింద్ పాల్గొన్నారు.