విజయనగరంలో ఘనంగా రామ్‌చరణ్‌ జన్మదిన వేడుకలు

విజయనగరం: సినీ హీరో రామ్‌చరణ్‌ జన్మదిన వేడుకలను బుధవారం విజయనగరంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం విజయనగరం పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో అల్పాహారాన్ని వితరణ చేశారు. అనంతరం జీఎస్ఆర్ హోటల్ దగ్గర బర్త్ డే వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి, స్వీట్స్ పంపిణీ చేశారు. అనంతరం
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో కేక్ కటింగ్,
మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా మెగా సోల్జర్స్,
జిల్లా చిరంజీవి యువత, అంజనీ పుత్ర చిరంజీవి ప్రజా సేవా సంఘం బ్లడ్ డోనర్స్ క్లబ్ ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిధిగా జనసేన నేత గురాన అయ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘చిరుత’గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఇప్పుడు ‘గేమ్‌ ఛేంజర్‌’గా తయారు అయ్యారని అన్నారు. తన నటనతో ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద ‘తుఫాన్లు’ క్రియేట్‌ చేస్తున్నారని కొనియాడారు. చిరంజీవి చారిటబుల్ ట్ర‌స్ట్ సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించే బాధ్య‌త‌ను రామ్‌చ‌ర‌ణ్ తీసుకున్నారన్నారు. చిరంజీవి న‌టించిన సినిమాల‌కు సంబంధించిన విశేషాలు, వివ‌రాల‌ను తెలియ‌జేయ‌డ‌మే కాకుండా ఆయ‌న చేసిన సేవా కార్య‌క్ర‌మాల‌ను గురించి తెలియ‌జేసేలా వెబ్ సైట్స్ ని ప్రారంభించారన్నారు. ట్ర‌స్ట్‌ సేవా కార్యక్రమాలను వివిధ ప్రాంతాల్లో ప్రజలకు అందించాలనే ఆలోచ‌న‌తో www.chiranjeevicharitabletrust.com వెబ్ సైట్‌తో ఆన్ లైన్ సేవ‌ల‌ను ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమాల్లో టిడిపి నేత పిల్లా విజయ్ కుమార్, జనసేన నేతలు ఆదాడ మోహన్ రావు, డి. రామచంద్రరాజు, టి.రామకృష్ణ, ఎంటి రాజేష్, పితాల లక్ష్మీ, దుప్పాడ జ్యోతి, అడబాల వేంకటేష్, గొల్లపల్లి మహేష్, ఎమ్. పవన్ కుమార్, మజ్జి శివశంకర్, ముదిలి శ్రీనివాస్, పి.అభిలాష్, దుప్పాడ నరేష్, చంధూ, శ్రావణ్ కుమార్, రఘు, దిలీప్, వెంకీ, మధు, రెడ్ క్రాస్ కార్యదర్శి కె.సత్యం తదితరులు పాల్గొన్నారు.