కూకట్ పల్లిలో రామ్ చరణ్ జన్మదిన వేడుకలు

  • గ్లోబల్ స్టార్ట్ రామ్ చరణ్ 39వ పుట్టినరోజు సందర్భంగా శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి దేవాలయం ప్రాంగణంలో రక్తదాన శిబిరం మరియు అన్నదాన కార్యక్రమం జరుపుకున్న మెగా అభిమానులు

కూకట్ పల్లి: మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం శ్రీశ్రీశ్రీ పోచమ్మ దేవాలయం ప్రాంగణంలో అఖిల భారత రామ్ చరణ్ యువత అరవింద్ చెర్రీ, సందీప్ ధనపాల ఆధ్వర్యంలో రక్త దానము మరియు అన్నదానం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమమునకు కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమమును మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు రవణం స్వామి నాయుడుతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ యువకులు రక్తదానం చేయడం అంటే ప్రాణం దానం చేయడమే అని, నేటి యువత మానవతా దృప్రధముతో సమాజంలో ఇలాంటి కార్యక్రమంలో నిర్వర్తించడము మరియు పాల్గొనడం గర్వించదగ్గ విషయమని. ప్రజల ప్రాణాలు కాపాడుకోవడం కొరకై రక్త దానము అనే విధానాన్ని ప్రజల్లోకి తీసుకువచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వార దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న మెగా అభిమానులను ప్రోత్సహిస్తున్న మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ రాంబాబు, భుట్టో రాంబాబు మరియు కొల్లా శంకర్, పి.సుభాష్, షణ్ముఖ, నూతి రాంబాబు, పులగం సుబ్బు, మధుసూధన్ రెడ్డి, సుధాకర్, నవీన్, అంజి, మెగా అభిమానులు పాల్గొన్నారు.