శ్రీ సీతారాముల జీవితచరిత్ర ఆదర్శనీయం, ఆచరణనీయం!

పిఠాపురం: శ్రీరామనవమి {సీతరాముల కళ్యాణం} సందర్భంగా గొల్లప్రోలుమండలం దుర్గాడ గ్రామంలో కొత్తపేట రామాలయం శ్రీ సీతారామాంజనేయ ఆలయకమిటీ వారి ఆహ్వానం మేరకు జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి, పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు హజరై సీతారాములకళ్యాణ మహోత్సవంలో పాల్గొని సీతారాములను దర్శించుకుని పూజాదికాది కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం శ్రీరామనవమి {సీతారాములకళ్యాణ మహోత్సవం} సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ హిందుమత చరిత్రలో ఆదర్శనీయులైన దంపతుల శ్రీ సీతారాముల ఘనచరిత్ర ప్రతి ఒక్కరికి ఆదర్శనీయంగా ఉంటుంది.కాబట్టే కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన శ్రీరాముని చరిత్రను ఆదర్శంగా తీసుకుని నేటికి ప్రతి సంవత్సరం ప్రపంచంలో, భారతదేశంలో గల ప్రతి వీధిలోని, కూడళ్ళులలొ గల రామాలయాల వద్ద బహిరంగంగా కులమతాలకు అతీతంగా, ఆదర్శంగా సీతారాములు కళ్యాణం జరుగుతుంది. నేటి ఆధునిక ప్రపంచంలో భారతదేశంలో అందరం కూడా తమ తమ జీవితాల్లో ఎంతో ఒత్తిడితో జీవిస్తున్నాం.మనం సీతారాములని ఆదర్శంగా తీసుకుని రాముని యొక్క క్రమబద్ధత, సీతాదేవి యొక్క నిబద్ధత ప్రతి స్త్రీ, పురుషులు ఆదర్శంగా తీసుకుని సమాజంలో జీవిస్తే నేటి సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను కొంతవరకు నిరోధించవచ్చు‌. రామాయణంలో మన వ్యక్తిగత జీవితాల్లో త్యాగశీలత, స్నేహం, ఆదర్శవంతమైన దాంపత్యజీవితం ఎలా ఉండాలనేది రాముడిని చూసి నేర్చుకోవచ్చు. స్త్రీలు అణుకుతో మెలకువతో ఎక్కడ ఎలా ఇతరుల వద్ద ఎలా మెలగాలి అనేది సీతాదేవిని చూసి నేర్చుకోవచ్చు. అన్న ముందు తమ్ముడు ఆదర్శవంతంగా ఎలా ఉండొచ్చు అనేది లక్ష్మణుడి నుంచి నేర్చుకోవచ్చు. ఒక స్నేహితుని వద్ద త్యాగాలు చేస్తూ నమ్మి ఎలా ఉండొచ్చు అనేది ఆంజనేయస్వామిని చూసి నేర్చుకోవచ్చు. అదేవిధంగా ఒక చెల్లెలు ఎలా ఉండకూడదు అనేది సూర్పణకను చూసి నేర్చుకోవచ్చు. ఒక శత్రువు ఎలా ఉండకూడదు అనేది రావణున్ని చూసి నేర్చుకోవచ్చు. కాబట్టి ఈరోజు సీతరాముల కళ్యాణం {శ్రీరామనవమి} ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే మన పూర్వీకులు భారతదేశం నందు గల రామాలయాల వద్ద ఆరుబయట బహిరంగంగా కుల, మతాలకతీతంగా సీతారాముల వివాహమహోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్న సంప్రదాయం ప్రకారం ఈరోజు దేశం నలుమూలల ఘనంగా శ్రీ సీతరాముల కళ్యాణ మహోత్సవాలను జరుపుకుంటున్నారు. శ్రీరామనవమి సందర్భంగా హిందూ బంధువులందరికీ నాహృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని హిందువుబందువులకు తెలియజేశారు. దుర్గాడ సీతరాముల కళ్యాణ కార్యక్రమంలో కొన్నెంపూడి ఆంజనేయులు{మాస్టారు}, బుద్దరాజు సుబ్బరాజు, కొటికలపూడి వెంకట రామచంద్రరావు మేడిబోయిన సత్యనారాయణ, జ్యోతుల సీతారాంబాబు, బుద్ధరాజు రాము, మేడిబోయిన నాగేశ్వరరావు, మాగాపు లోవరాజు, ఆకుల నాగేశ్వరరావు, వెలుగుల అబ్బు, రావుల తాతారావు, జీలకర్ర కృష్ణ, కురు వెంకటేశ్వరరావు, సాధనాల చంటిరాము, మేడిబోయిన నాగేశ్వరరావు, యర్రంశెట్టి రాంప్రసాద్, కాపారపు సత్యనారాయణ, కుక్కులూరి బాజ్జి, బండిరాంబాబు, సింగులూరి సత్యనారాయణ,
కొటికలపూడి సత్యనారాయణ, శాఖ సురేష్, కీర్తి చిన్నా, జ్యోతుల శివ, జీలకర్ర బాను, నేమాల కన్నయ్య, నాగబొయిన వీరబాబు తదితరులు ఉన్నారు.