విశాఖలో మరో భారీ ర్యాలీ…25 నుంచి సమ్మె…

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంపై పెద్ద ఎత్తున రగడ జరుగుతున్నది. కార్మికులు ఇప్పటికే బయటకు వచ్చి నిరసనలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె, ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు భారీ ర్యాలీని నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. కూర్మన్నపాలెం ఆర్చ్ నుంచి ర్యాలీ ప్రారంభించనున్నారు. ఆర్చ్ నుంచి స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనం ముట్టడికి నిర్వాసితులు బయలుదేరారు. ప్లాంట్ కోసం భూములిచ్చిన తమకు న్యాయం జరగలేదని 64 గ్రామాల ప్రజలు చెప్తున్నారు. ఇప్పటికి సాయం అందలేదని 8500 మంది నిర్వాసితులు ఈ ర్యలేమిని నిర్వహిస్తున్నారు. ఈనెల 25 నుంచి సమ్మెకు వెళ్తామని విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ప్రకటించారు.