కమల్‌ హాసన్ పార్టీ ట్రెజరర్ ఇంట్లో భారీగా నగదు స్వాధీనం..!

తమిళనాట ఐటీ దాడుల్లో కోట్లాది రూపాయలు బయటపడుతున్నాయి. మూడ్రోజులుగా జరుగుతున్న సోదాల్లో పెద్ద ఎత్తున మనీని సీజ్‌ చేశారు అధికారులు. కమల్‌ హాసన్‌ మక్కల్‌ నీది మయ్యం ట్రెజరర్‌.. చంద్రశేఖరన్‌ నివాసం, కార్యాలయాలపై మూడ్రోజులుగా ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. పెద్ద ఎత్తున డబ్బు దాచి పెట్టారనే సమాచారంతోనే ఈ తనిఖీలు నిర్వహించింది ఐటీ శాఖ. ఈ దాడుల్లో భారీగా నగదు బయటపడింది. ఇప్పటివరకు 11 కోట్ల నగదు ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో కమల్ హాసన్ కు ఎన్నికల వేళ పెద్ద ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఇప్పటివరకు సోదాల్లో 11 కోట్లు చేసుకోగా..ఇంకా నగదు దొరికే అవకాశం ఉందని సమాచారం. మరి పార్టీ అధినేత ఇంట్లో కూడా దాడి జరిగే అవకాశం కూడా ఉందని తమిళ్ మీడియా లో వార్తలు వస్తున్నాయి. ఇక తమిళ నాడు లో మొదటి నుండి కూడా ఈ డబ్బు రాజకీయాలు జరుగుతూనే ఉన్న నేపథ్యంలో ఎన్నికల వేళ ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు నాయకులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మరికొందరి ప్రముఖుల ఇళ్ళలో కూడా ఐటీ సోదాలు నిర్వహించే అవకాశం ఉంది.