స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో జనసేన ఓటు బలం చాటిన కార్పొరేటర్లు

విశాఖపట్నం జివిఎంసి స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో జనసేన పార్టీ కార్పొరేటర్లు తమ ఓటు హక్కును వినియోగించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ నేతృత్వంలో, మేయర్ పీలా శ్రీనివాస్ తో కలిసి, జనసేన కార్పొరేటర్లు సంఘబద్ధంగా ఎన్నికల్లో పాల్గొన్నారు. 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజ్‌తో పాటు ఇతర జనసేన కార్పొరేటర్లు పార్టీ ఆదేశాల మేరకు కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు తమ ఓటు హక్కును వినియోగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విశాఖ అభివృద్ధికి కూటమి విజయం కీలకం అని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రం కూటమి పాలనలో అభివృద్ధి బాటలో నడుస్తోందని, స్టాండింగ్ కమిటీ ఎన్నికల ఫలితాలు విశాఖ నగర భవిష్యత్‌ను మరింత బలపరిచేలా ఉంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు. జనసేన నేతలు, విశాఖను ప్రపంచంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ముందున్న నగరంగా తీర్చిదిద్దే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రజలు దీనికి సహకరించాలని పిలుపునిచ్చారు.

Share this content:

Post Comment