పవన్ పై దూషణను ఖండించిన నల్లా శ్రీధర్

అమలాపురం, జనసేన అధినేతపై ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ వ్యాఖ్యలను అమలాపురం నియోజకవర్గ జనసేన నేత నల్లా శ్రీధర్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా జనసేన అధినేత, ప్రజల నాయకుడు, డిప్యూటీ సి ఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వైసిపికి చెందిన ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది రాజకీయ విమర్శ కంటే వ్యక్తిగత దూషణకు దగ్గరగా ఉంది. ఓ ఎమ్మెల్సీ పదవిలో ఉన్న వ్యక్తిగా ఈ స్థాయికి దిగజారడం బాధాకరం. మీ రాజకీయ ప్రస్థానంలో టిటిడి దర్శన టికెట్లు అమ్ముకోవడం వచ్చిన ఆరోపణలు, ఇవన్నీ ప్రజల మదిలో స్పష్టంగా ఉన్నాయి. మీరు ముందు మీ నైతిక స్థితిని మెరుగుపరచుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఎవరి బానిస కారు. ఆయన ప్రజల భవిష్యత్తు కోసం పోరాడుతున్న నాయకుడు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటూ ముందుకెళ్తున్న నాయకుడిపై మీరు ఈ స్థాయిలో మాట్లాడటం రాజకీయ బాధ్యతారాహిత్యాన్ని చూపిస్తోంది. మీ వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకొని, ప్రజల మనోభావాలకు గౌరవం చూపగలరని ఆశిస్తున్నాను. లేకపోతే ప్రజలు మీ మాటలకూ, నడవడికకూ తగిన న్యాయం చేసే రోజు దగ్గరలోనే ఉందని నల్లా శ్రీధర్ పేర్కొన్నారు.

Share this content:

Post Comment