యల్లటూరును కలసిన కన్నా రజిని

*రాజంపేటలో జనసైనికుడి మృతిపై న్యాయం కోసం యత్నం

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం యల్లటూరు భవన్‌లో గురువారం రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజుని జనసేన పార్టీ అధికార ప్రతినిధి మరియు హైకోర్టు అడ్వకేట్ కన్నా రజిని కలిసి, మరణించిన జనసైనికుని వ్యవహారంపై చర్చించారు. గత నెలలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుంటూరుకు చెందిన జనసైనికుడు మోహనకృష్ణకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లో అనేక లోపాలున్నాయని, అతడు పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని మాత్రమే కాక, టిడిపి-జనసేన కూటమికి అంకితంగా పనిచేసిన వ్యక్తి అని వివరించారు. ఘటనకు సంబంధించి పోలీస్ శాఖను సంప్రదించి బాధితుడికి న్యాయం జరగేలా చర్యలు తీసుకోవాలని కన్నా రజిని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా యువతకు సందేశంగా, జనసేన సభ్యత్వ నమోదు చేసుకోవాలని, హెల్మెట్ ధరించటం, లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచనలు చేశారు. ఈ సమావేశంలో స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share this content:

Post Comment