*నేతన్నలకు జ్యోతుల శ్రీనివాసు కీలక హామీలు
కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గం, దుర్గాడ గ్రామంలో జాతీయ చేనేత కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని, జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు ప్రత్యేక అతిథిగా హాజరై, మగ్గంపై వస్త్రాలు నేసే 65 మంది నేతన్నలను ఘనంగా సత్కరించారు. శ్రీ మార్కండేయ చేనేత సంఘం ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో నేతకార్మికులకు శాలువాలు కప్పి, జ్ఞాపికలు, సన్మాన పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన కూటమి ప్రభుత్వం నేతన్నలకు పింఛన్లు, జీఎస్టీ మినహాయింపు, మగ్గం దారాల కొనుగోలుకు రాయితీలు కల్పిస్తున్నదని తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా చేనేత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. చేనేత రంగం అనేది భారతీయ సంప్రదాయానికి ప్రతీక అని, ప్రతి నేతన్నకు ప్రభుత్వాల పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో దుర్గాడ గ్రామ చేనేత సొసైటీ కార్యదర్శి తీడ నాగరాజు, చేనేత సొసైటీ పెద్దలు చేసెట్టి సూర్యనారాయణ, బేతా సత్యనారాయణ, మాడెం నాగేశ్వరరావు, వట్టూరి సత్యనారాయణ, చేసెట్టి పార్వతి, పంపన బాగ్యలక్ష్మి, కొల్లు మంగ, ముద్దన నాగమణి, దుర్గాడ గ్రామ జిల్లా పరిషత్ చెర్మన్ శాఖ నాగేశ్వరరావు{నాగు}, గ్రామపంచాయతీవార్డు సభ్యులు గుండ్రా సీతరాం, విద్యాకమిటి మాజీ చైర్మన్ కందా శ్రీను, గ్రామ జనసేన పార్టీ నాయకులు మొగిలి శ్రీను, జ్యోతుల శివ, సఖినాల రాంబాబు, శాఖ సురేష్, జీలకర్ర సూరిబాబు, కొప్పుల చక్రదర్, కాపారపు వెంకటరమణ(పూసలు), జ్యోతుల సీతరాంబాబు, రావుల వెంకన్న, మేడిబోయిన శ్రీను, ఆకుల అర్జున్, మెడిబోయిన సత్యనారాయణ, జ్యోతుల వాసు, అయినవిల్లి శ్రీను, పోలం త్రిమూర్తులు, జ్యోతుల గోపి, అయినవిల్లి వీరబాబు, మంతిన గణేషు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment