నిడదవోలు, వ్యవసాయ మార్కెట్ కమిటీల చెక్ పోస్టుల్లో పారదర్శకత కోసం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ డిజిటల్ చెల్లింపుల పథకాన్ని ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పెరవలిలోని చెక్ పోస్టు వద్ద ఈ డిజిటల్ వసూలు పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభమైంది. ఇప్పటి వరకు నగదుగా వసూలు చేస్తున్న మార్కెట్ ఫీజులను ఇకపై ఈ-పాస్ యంత్రాల ద్వారా డిజిటల్‌గా వసూలు చేయనున్నారు. ఇది ఆదాయంలో పారదర్శకతకు దోహదం చేయడంతో పాటు, అక్రమాల నిరోధానికి కీలక అడుగుగా నిలవనుంది. ఈ ప్రారంభ కార్యక్రమంలో తూర్పుగోదావరి కలెక్టర్ పి.ప్రశాంతి, ఇతర అధికారులు, మార్కెట్ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment