ఘనంగా శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక దినోత్సవం

*కూటమి నేతల ఆధ్వర్యంలో శ్రీ కృష్ణదేవరాయలకు ఘన నివాళి

విజయవాడ, విజయనగర సామ్రాజ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గుణశీలి, ప్రజారంజకుడు, గొప్ప పరిపాలకుడు శ్రీ కృష్ణదేవరాయల పట్టాభిషేక దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. రాయల సేన, పోరు మామిళ్ల ఈశ్వర్ ఆహ్వానంపై విజయవాడ బస్టాండ్ పక్కన కృష్ణానది తీరాన వేంచేసి ఉన్న శ్రీ కృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ “శ్రీకృష్ణదేవరాయలు రాజ్యాధికారం చేపట్టిన అనంతరం దక్షిణ భారతదేశం సాంస్కృతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అద్భుతంగా అభివృద్ధి చెందింది. ఆయన పాలన లోగడ మాత్రమే కాదు, నేటికీ పరిపాలనకు మాదిరిగా నిలుస్తుంది. యువత రాయల పాలనను అధ్యయనం చేసి ప్రజాస్వామ్యంలో తమ పాత్రను సక్రమంగా నిర్వర్తించాలి.” అని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. “ఆస్థానంలో జనానికే కాదు, కవులకు, పండితులకు ఆశ్రయదాతగా శ్రీకృష్ణదేవరాయలు నిలిచారు. తెనాలి రామకృష్ణులు లాంటి వారిని తన అస్థానంలో చేర్చుకుని జాతీయ స్థాయిలో తెలుగు పరిరక్షణకు ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయి. తెలుగు వంశీయులందరం ఆయన వారసత్వాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి.” అని అన్నారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ పార్లమెంట్ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ.. “సమగ్ర అభివృద్ధి అంటే కేవలం మౌలిక వసతులకే పరిమితం కాదు. శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఆధ్యాత్మికత, సాహిత్యం, సామాజిక సమరసతకు ఇచ్చిన ప్రాధాన్యత మన రాజకీయ నాయకులకు మార్గదర్శకంగా ఉండాలి. ప్రజల మనోభావాలను గౌరవించే నాయకత్వం అప్పటిలాగే నేడు కూడా అవసరం.” అని అన్నారు. పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకురాలు తిరుపతి అనూష మాట్లాడుతూ.. “మహిళలకు కూడా రాయల పాలనలో గౌరవం లభించింది. నేడు మహిళా శక్తికి గౌరవం దక్కాలంటే రాజుల కాలంలో ఉన్న విలువలనే అచరిస్తే అన్ని రంగాల్లో దూసుకువెళ్లే అవకాశం లభిస్తుంది. యువత, ముఖ్యంగా యువతులు, ఈ చరిత్రను తెలుసుకొని ముందుకు సాగాలి.” అని అన్నారు. విజయవాడ జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ తిరుపతి సురేష్ మాట్లాడుతూ.. “ఈరోజు నాయకులు కేవలం పదవుల కోసం పోటీపడుతున్నారు. కానీ శ్రీకృష్ణదేవరాయల పాలనను చూసినపుడు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఉన్న శ్రేష్ఠ పాలకుని తత్వం స్పష్టమవుతుంది అని అన్నారు, ఈ అవకాశం కల్పించిన రాయల సేన సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. పోరు మామిళ్ల ఈశ్వర్ మాట్లాడుతూ.. “రాయల సేన దీక్షతో ప్రతి ఏటా పట్టాభిషేక వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనందకరం. యువతకు చరిత్రపై అవగాహన కలిగించే కార్యక్రమాలు అవసరం” అని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన రాయల సేన, స్థానిక కార్యకర్తల కృషిని నేతలు అభినందించారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాల మాట్లాడుతూ “శ్రీకృష్ణదేవరాయలు అనగానే సాహసం, శౌర్యం, విజ్ఞానం మన కళ్ల ముందుకు వస్తాయి. ఆయన పాలనలో విద్య, వ్యవస్థలు, నీతి, న్యాయం అన్నీ సమన్వయంతో నడిచాయి. అలాంటి పాలనకు ప్రేరణగా నిలిచే ఈ మహానుభావుడికి నివాళులర్పించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. యువత నాయకత్వ లక్షణాలను నేర్చుకోవాలంటే రాయల చరిత్రను అధ్యయనం చేయాలి.” అని అన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుని కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్, సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్, కృష్ణ పెన్న రీజినల్ మహిళా కోఆర్డినేటర్ రావి సౌజన్య, రాయలసేన సభ్యులు భూపతి మహేష్, పండాలనేని శివ గోపాల్, భాశెట్టి ప్రసాద్, కూనపురెడ్డి రమేశ్, జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా సెక్రెటరీ బండ్రెడ్డి రవి, డాక్టర్ కొండవీడు ఉపాధ్యక్షులు కమాళ్ల సోమనాదం,బొమ్మ దేవర రత్నకుమారి, చలామల శెట్టి శ్రీను, పోలిశెట్టి శివ, పులిచేరి రమేష్, విజయ్, ఉమ్మడి శెట్టి కృష్ణ కూటమి నాయకులు, పలు ప్రాంతాల నుండి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-08-07-at-4.52.08-PM-1004x1024 ఘనంగా శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక దినోత్సవం

Share this content:

Post Comment