అండర్‌పాస్–సర్వీస్ రోడ్ల పనులపై మెరుగైన దృష్టి

*రాంపురం జంక్షన్ వద్ద అండర్‌పాస్, సర్వీస్ రోడ్ల నిర్మాణానికి పరిశీలించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు

పెందుర్తి, అనకాపల్లి నుండి ఆనందపురం వైపు వెళ్ళే నేషనల్ హైవే సర్వీస్ రోడ్లు మరియు అండర్ పాస్ సబ్‌వే నిర్మాణంపై సమీక్షించేందుకు జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పలు ప్రాంతాల్లో నేషనల్ హైవే అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా రాంపురం గ్రామం జంక్షన్ వద్ద అండర్ పాస్ నిర్మాణానికి సంబంధించి కేంద్రానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపిన విషయాన్ని గుర్తు చేస్తూ, పనులు త్వరితగతిన ప్రారంభించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అనకాపల్లి-ఆనందపురం మార్గంలో పెందుర్తి వెళ్లే సమయంలో సర్వీస్ రోడ్ల లేకపోవడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులు పరిగణనలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో నేషనల్ హైవే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జ్ఞాన వేణి, ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రభాత్ రంజన్, సైట్ ఇంజినీర్లు పవన్ కుమార్, రిచర్డ్, తహసీల్దార్ చిన్ని కృష్ణ, ఎంపీటీసీ గండి హిమబిందు తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు, ఎన్డీఏ మహాకూటమి నాయకులు, జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Share this content:

Post Comment