అనాథ పిల్లలకు డిప్యూటీ సిఎం ఆసరా

*42 మందికి రూ.2.10 లక్షలు అందజేసిన జనసేన పార్టీ క్రియాశీలక వాలంటరీలు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జీతంతో గత 3 నెలలుగా జరుగుతున్న సహాయ కార్యక్రమాల్లో భాగంగా, పిఠాపురం నియోజకవర్గంలో తల్లిదండ్రులు లేని పిల్లల కోసం మరోసారి ఉదారతను చాటారు. ఆగస్టు 6, 7 తేదీల్లో జనసేన పార్టీ క్రియాశీలక వాలంటీర్ల ఆధ్వర్యంలో, 42 మంది అనాధ పిల్లలకు ఒక్కొక్కరికి రూ.5 వేలు చొప్పున మొత్తం రూ.2.10 లక్షల విలువైన చెక్కులు వారి ఇంటికే వెళ్లి అందజేశారు. ఇది వరుసగా నాల్గవ నెల పవన్ కళ్యాణ్ తన జీతాన్ని వినియోగించి ఈ పిల్లల కోసం చేయుచున్న మానవతా సేవగా నిలిచింది. దేవుని పిల్లల ఇళ్లను సందర్శించిన వాలంటీర్లు, వారి సమస్యలు నేరుగా తెలుసుకుని, పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ తమతో పాటు ఉంటారని వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ క్రియాశీల వాలంటీర్లు ఓదూరి కిషోర్, బుర్ర దివ్య, జ్యోతుల శ్రీనివాస్, ఒరిగంటి పెద్దకాపు, పెంకే జగదీష్, చెల్లుబోయిన సతీష్ కుమార్, దొడ్డి దుర్గాప్రసాద్, వేగిశెట్టి సూర్య నిఖిల్, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, మచ్చ అప్పాజీతో పాటు జనసేన ఐటీ టీం సభ్యులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ సాయంతో పిఠాపురం నియోజకవర్గంలోని అనాధ పిల్లలకు మానవతా మద్దతు అందడంతో పాటు, సేవా విధానంలోనూ ఆయన ప్రాముఖ్యత స్పష్టమవుతోంది.

Share this content:

Post Comment