దెందులూరు నియోజకవర్గం: ఏలూరు రూరల్ మండలం, కాట్లంపూడి గ్రామానికి చెందిన రైతులకు ప్రభుత్వం సబ్సిడీ తో అందించిన పంట పొలాలకు ఉపయోగపడే డ్రోన్ ని శుక్రవారం జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, దెందులూరు నియోజకవర్గ ఇన్చార్జి ఘంటసాల వెంకటలక్ష్మి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఘంటసాల వెంకటలక్ష్మి మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడే డ్రోన్ ను అత్యంత తక్కువ ధరకు సబ్సిడీకి అందించి రైతులకు మేలు చేయడాన్ని బట్టి చూస్తే కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదనడానికి ఇదే నిదర్శనం అని,వ్యవసాయంలో అత్యాధునికత ఉపయోగించి తక్కువ ఖర్చుతో వ్యవసాయాన్ని సాగు చేసి రైతులకు మేలు జరిగేలా కూటమి ప్రభుత్వం చర్య తీసుకుంటుందని, దీనికి సహకరించిన దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి, వ్యవసాయ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో సహకార బ్యాంకు చైర్మన్ మోటేపల్లి పవన్ హరిచంద్ర కుమార్, నీటిసంఘం ప్రెసిడెంట్ మాగంటి సుభాష్ చంద్రబోస్, కాట్లంపూడి మాజీ సర్పంచ్ అర్జా విజయ కుమారి, దెందులూరు నియోజకవర్గ అధికార ప్రతినిధి తాతపూడి చందు, పోతునూరు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు చదరం విద్యాసాయి, స్థానిక రైతులు కె.శ్రీనివాసరావు, కె.రవికిషోర్, కె.నరసింహులు, పి.భాస్కరరావు, ఆర్.సూర్యనారాయణ మరియు స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.
Share this content:
Post Comment