ఆముదాలవలస నియోజకవర్గం: శ్రీకాకుళం జిల్లా, పొందూరు మండలం బాణం గ్రామానికి చెందిన జనసేన పార్టీకి చెందిన కార్యకర్త బొల్లా రావు మరియు కుమార్తె పావని లను భూ తగాదాలతో అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు తీవ్రంగా దాడి చేశారు. దాడి అనంతరం 108 సాయంతో స్థానిక శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రిలో బొల్లారావు అడ్మిట్ అయ్యాడు. అయితే ఈ ఘటన సంబంధించి పోలీసులు ఫిర్యాదు చేసిన ఫిర్యాదు తీసుకోలేదని జనసేన పార్టీ కార్యకర్త బొల్లారావు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి పేడాడ రామ్మోహన్ హాస్పిటల్ కి వెళ్లి పార్టీ నాయకులతో కలిసి బొల్లారావును పరామర్శించారు. దాడికి సంబంధించి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని అంతేకాకుండా ఒక దళితుడిపై ఈ విధంగా దాడి చేయడం ఎంతవరకు సబబని పోలీసులు అధికారంలో లేని వారికి సపోర్ట్ చేస్తున్నారు కానీ అధికార పార్టీకి సంబంధించిన జనసేన పార్టీ కార్యకర్తపై దాడి చేస్తే ఎందుకు కేసు నమోదు చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని అంతేకాకుండా జిల్లా ఎస్పీ కూడా ఈ కేసును సుమోటాగా తీసుకుని వెంటనే దీని కారకులైన వారిని అరెస్టు చేయాలని కోరారు.
Share this content:
Post Comment