రాజోలు, మలికిపురం మండలం, మలికిపురం మార్కెట్ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా శుక్రవారం మలికిపురం మార్కెట్ ఏరియాను శాసన సభ్యులు దేవ వరప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా గౌరవ శాసన సభ్యులు మాట్లాడుతూ మలికిపురం ఆదివారం మార్కెట్ అంటే పూర్వం నుండి గొప్ప పేరు ఉండేదని అన్నారు. రెండు ఎకరాలు మార్కెట్ స్థలం ఉన్న ఒక ఎకరం మాత్రమే ఉపయోగిస్తున్నారని మిగిలిన స్థలం నిరుపయోగంగా ఉందని అన్నారు. ఒక క్రమ పద్ధతిలో ఈ మార్కెట్ నిర్మాణం జరగలేదని అన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అధునాతనంగా క్రమ పద్ధతిలో మార్కెట్ నిర్మాణం జరగాలని అని అన్నారు. తద్వారా మార్కెట్ అభివృద్ధి చెందుతుందని ఆదాయంగా కూడా గణనీయంగా పెరుగుతుందని అన్నారు మార్కెట్ పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో మలికిపురం రోడ్ డబుల్ లేన్ చేయవలసిన అవశ్యకత ఉందని దానికి అందరూ సంసిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, సంబంధిత అధికారులు, వ్యాపారస్థులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment