ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కు రాఖీ లను కట్టిన వీరమహిళలు

తిరుపతి: రాఖీ పండుగను పురస్కరించుకొని జనసేన పార్టీ వీరమహిళలు ఆకేపాటి సుభాషిని, తోట జయంతి, రాధా, శాంతి యాదవ్, అమృత, శిరీష, చందన, లావణ్య, వరలక్ష్మి తదితరులు శనివారం తిరుపతిలోని ఎన్జీవో కాలనీ ఆఫీస్ నందు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కు రాఖీ లను కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ రాఖీ పండుగ ఎంతో పవిత్రమైనదని, సోదర సోదరీమణుల ప్రేమకు ప్రతిరూపంగా జరుపుకునే ఈ అపురూపమైన వేడుక రాఖీ పండుగన్నారు. ఆప్యాయత, అనురాగాల నడుమ మా వీరమహిళలతో కలిసి ఈ పండుగను జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే ఆనందాన్ని వ్యక్తం చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మహిళలందరిపై నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానన్నారు. మా జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మా పార్టీలో మహిళలకు పెద్దపీట వేస్తారని, అందుకే మా పార్టీలోని మహిళలను వీరమహిళలుగా పిలుస్తామన్నారు. కూటమి ప్రభుత్వంలో.. సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల అధ్యక్షతన రాష్ట్రంలో మహిళలందరూ సంతోషంగా ఉంటారని హామీ ఇచ్చారు. మహిళల రక్షణనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్పష్టం చేశారు.

Share this content:

Post Comment