రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి దుర్గేష్ విచారం

నిడదవోలు, కొవ్వూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానూరు అగ్రహారానికి చెందిన దవులూరి సుబ్రహ్మణ్యం (44), లంకే ప్రసాద్ (26) కుటుంబాలకు మంత్రి కందుల దుర్గేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే ఆయన కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి, బాధిత కుటుంబాలకు చెరో రూ.10,000 వ్యక్తిగత ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం తరఫున కూడా అవసరమైన సహాయం అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చిన మంత్రి, ప్రయాణాల సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Share this content:

Post Comment