అయినవిల్లిలో సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

పి.గన్నవరం, డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి మండలం, అయినవిల్లి గ్రామంలో సోమవారం ₹10 లక్షల వ్యయంతో నిర్మించబోతున్న సిసి రోడ్డు శంకుస్థాపనను పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే నియోజకవర్గంలోని 85% రోడ్లు పూర్తయ్యాయి. మిగిలిన 15% రాబోయే ఏడాదిలో పూర్తి చేసి, నియోజకవర్గాన్ని ఒక సుందర నియోజకవర్గంగా మార్చుతాను” అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment