ఎస్.కోట, తిమిడిలో మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది. కార్య్క్రమంలో భాగంగా ఫీల్డ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ లాండ్ రికార్డ్స్ చేయించుకోవాలని ఎస్.కోట మండల రిసర్వ్ ఉప తహసీల్దార్ కీర్తి గ్రామ సభలో రైతులకు పిలుపునిచ్చారు. తిమిడి రిసర్వ్ ల్యాండ్ కి 13 నోటిఫీకేషన్ ఇవ్వనందున మ్యుటేషన్ పెట్టుకొని మీ భూమి ఆన్ లైన్ చేసుకోమణి రైతులకు అవేర్నస్ కలిగించేందుకు గ్రామసభ పెట్టమని, ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకోవాలన్నారు. జనసేన ఎస్.కోట నియోజకవర్గ నాయకులు వబ్బిన సన్యాసినాయుడు రెవెన్యూ గ్రామసభనుద్దేశించి ప్రసంగిస్తూ.. సాదా బైనామాలు ఆన్ లైన్ చేయుటకు ప్రభుత్వం అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. గత వైసీపీ ప్రభుత్వం చేయించిన రిసర్వే లోపాలను సవరించేందుకు మరల రీసర్వే చేయాలని అధికారులకు సూచించారు. ఈ గ్రామసభలో సర్పంచ్ వబ్బిన త్రినాదమ్మ, వైస్ సర్పంచ్, ఎంపిటిసి పడాల ధర్మారావు, వి రాంబాబు సచివాలయం సర్వేయర్ సాయి వి.ఆర్.ఏ, జ్యోతి, రైతులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment