స్వాతంత్ర్య వేడుకలకు సమాయత్తం అవుతున్న ఏ.కే.యూ ప్రాంగణం..!

ఏ.కే.యూ, ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా ఆగస్ట్ 15వ తేదీ శుక్రవారం నిర్వహించనున్న 79వ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమం కోసం స్థానిక ఆంధ్ర కేసరి యూనివర్సిటీ సమాయత్తం అవుతోంది. ఇందులో భాగంగా స్థానిక ఉప కులపతి ప్రొఫెసర్ డి.వి.ఆర్.మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి. హరిబాబుల సూచనల మేరకు మంగళవారం ఏ.కే.యూ ప్రాంగణంలో పిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్. నిర్మలామణి ఆధ్వర్యంలో క్యాంపస్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. విద్యార్థులు, సిబ్బంది జాతీయ జెండాలను చేత పట్టుకొని స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ, భారత మాతాకీ జై అంటూ నినదిస్తూ ఆంధ్ర కేసరి యూనివర్సిటీ ప్రాంగణంలో కలియ తిరిగారు. ఈ సందర్భంగా ఏ.కే.యూ. కళాశాల పిన్సిపాల్ ప్రొఫెసర్ నిర్మలామణి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆనాటి స్వాతంత్రోద్యమ కాలంలో ఎందరో త్యాగ ధనులు అశువులు బాశారని, వారి కృషి ఫలితమే ఈనాడు అఖండ భారతావనిలో ప్రజలు స్వేచ్చా, స్వాతంత్య్రలతో జీవిస్తున్నారని అన్నారు. నేటి యువతరం కూడా భారతావని లో అభివృద్ధి, సంక్షేమం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. ఆగస్టు15వ తేదీన ఆంధ్ర కేసరి యూనివర్సిటీ ప్రాంగణం నందు జరిగే 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రొఫెసర్ నిర్మలామణి సూచించారు. విద్యార్థులను ఉద్దేశించి ఆంధ్ర కేసరి యూనివర్సిటీ ఎన్.ఎస్.ఎస్. కో ఆర్డినేటర్ డాక్టర్ మండే హర్ష ప్రీతం దేవ్ కుమార్ ప్రత్యేక సందేశం అంద జేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నిర్మలామణి, స్టూడెంట్ అఫైర్స్ డీన్ డాక్టర్ ఏ. భారతీ దేవి, ఎన్.ఎస్.ఎస్. కో-ఆర్డినేటర్ డాక్టర్ మండే హర్ష ప్రీతం దేవ్ కుమార్ తోపాటు పలువురు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share this content:

Post Comment