దాసరి ప్రియాంక మరణం బాధాకరం: ఆళ్ళ హరి

గుంటూరు, కాపు, తెలగ, బలిజ సమైక్య జాయింట్ యాక్షన్ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు, సామాజిక, పర్యావరణ వేత్త దాసరి రాము కుమార్తె దాసరి శేషసాయి ప్రియాంక అకాల మరణం అత్యంత బాధాకరమని జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆవేదన వ్యక్తం చేశారు. నిరంతరం దైవ చింతనలో, సమాజ సేవలో గడిపే రాము ఇంట ఇంతటి విషాదం నెలకొనటం దురదృష్టకరమన్నారు. డాక్టర్ కోర్స్ చదువుతున్న శేషసాయి ప్రియాంక మరణవార్త తనను తీవ్ర దిగ్బ్రాంతికి గురించేసిందని. ఆమె ఆత్మకు సద్గతి కలగాలని అయన భగవంతుడిని కోరుకున్నారు. దాసరి రాము కుటుంబానికి ఆళ్ళ హరి తన ప్రగాఢ సానుభూతిని తెలియచేసారు.

Share this content:

Post Comment