మాడుగుల: మాడుగుల పంచాయతీకి చెందిన 14వ వార్డులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. స్థానికులు కాలువ సమస్య, వీధి లైట్లు లేకపోవడం, డ్రైనేజీ సమస్యలు, ఎలక్ట్రికల్ పోల్స్ అవసరం వంటి సమస్యలను వివరించారు. సమస్యలను నోట్స్ చేసుకుని, సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాడుగుల పట్టణ కమిటీ సభ్యులు, జనసైనికులు, స్థానిక జనసేన నాయకులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment