తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ఆదివారం వైసిపి పార్టీ నుండి జనసేన పార్టీలోకి గూడెం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బొడ్డు సాయిబాబా, తాడేపల్లిగూడెం నియోజకవర్గ రెడ్డి సంఘం అధ్యక్షులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోశాధికారి నాగేందర్ రెడ్డి వారి అనుచరులతో 500 మంది జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ వారికి జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి మాట్లాడుతూ ఎన్నో విలువలతో కూడిన పార్టీ జనసేన పార్టీ అని పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ప్రజల అభ్యున్నతికి పాటుపడే పార్టీ జనసేన పార్టీ అని కొనియాడారు మన నియోజకవర్గ ప్రజలు అఖండ మెజారిటీతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు వారు నామీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానని ఈ ఐదేళ్ల కాలంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి నేను పెద్ద కొడుకుల ఉంటానని అన్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నా ఇంటి తలుపులు ఎప్పుడు తెరచే ఉంటాయని తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో అనేక రోడ్లు వేసామని, పి ఫోర్ లో భాగంగా క్రికెట్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, జడ్పీ స్కూల్ ప్రాంగణ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. రెండు కోట్లతో టౌన్ హాల్ కడతామని అన్నారు ఇప్పటికే 2 కోట్ల 45 లక్షల రూపాయలు ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు ఇచ్చామని అన్నారు. మన నియోజకవర్గంలో ఎయిర్ పోర్ట్ నిర్మాణం జరుగుతాదని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి నేను ఎంతో కష్టపడుతూ ఉంటే ప్రజలు సాగనంపిన ఘనుడు కొట్టు ప్రెస్ మీట్ లు పెట్టి అసత్యాలు పలుకుతున్నారని అన్నారు. తాడేపల్లిగూడెం కి ఎయిర్ పోర్ట్ వస్తుందని ప్రజలు ఆనందిస్తుంటే రైతులు చేత కోర్టులో కేసులు వేయమని రైతుల్ని రెచ్చగొడుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వంలో టిడిఆర్ బాండ్లు, సొసైటీలు, మున్సిపాలిటీ, గ్రావెల్, ఇసుక వంటి వాటిలో విపరీతమైన దోపిడీ చేశారని అన్నారు. సామాన్య ప్రజానీకం నుండి పెద్ద స్థాయి వరకు కే టాక్స్ లేనిదే పనులే జరగలేదని ఎద్దేవా చేశారు. కొట్టు బాధితుల సంఘం లిస్టు సిద్ధంగా ఉందని కొట్టు నాతో పాటు ప్రజల మధ్యలోకి వస్తే ఎవరి అవినీతి ఎంతో బట్టబయలు చేస్తానని సవాల్ విసిరారు. ఎక్కడెక్కడ ఎంతెంత అవినీతికి పాల్పడ్డావో ఆధారాలతో నిరూపిస్తాం అని ఎమ్మెల్యే అన్నారు. ప్రజల వద్దకు రా ఎవరు ఎంత ఇచ్చారో చెబుతారు అవినీతి చేసిన వారు వాళ్లు ఊరు వదిలి పోవాలని బొలిశెట్టి సవాల్ విసిరారు నీకు దమ్ము లేదు పనిచేసే ధైర్యం లేదు నీ కోసం మాట్లాడే ఓపిక నాకు లేదని ఎద్దేవా చేశారు. గతంలో నీకు చెప్పాను చెప్పు దెబ్బలు తప్పవని ఈసారి తప్పకుండా జరుగుతుందని అన్నారు. కొన్ని ప్రాజెక్టులు మొదలుపెట్టినప్పుడు కొంత సమయం తీసుకుంటుందని విశాఖ ఎయిర్ పోర్ట్, పోలవరం ప్రాజెక్ట్ పనులు చేపట్టారు ఎన్ని ఏళ్ళు అయింది అని ప్రశ్నించారు. తాడేపల్లిగూడెంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పూర్తి చేయలేకపోయావని ఎద్దేవా చేశారు ఫ్లైఓవర్ నిధులు తినేసి ఐదు కోట్లతో ఇల్లు కట్టుకున్నావని నీవా ప్రజా సేవ చేసేవాడు అని అన్నారు. కరోనా సమయంలో ప్రజల మధ్యలో నేనుండి దాదాపు కోటి రూపాయలు నిత్యవసరాలు ఇచ్చి నేను అధికారంలో లేకపోయినా ప్రజలకు సేవ చేసానని గుర్తు చేశారు. కానీ నీవు ఆ సమయంలో బెంగళూరు కి పోయావని అన్నారు ఇక ఆ పార్టీ అధినేత గురించి మాట్లాడితే తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలకు ఏం న్యాయం చేస్తాడని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 80% సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి సూపర్ హిట్ అయిందని కొనియాడారు. కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ ఆశీస్సులతో చంద్రబాబు నాయకత్వంతో పవన్ కళ్యాణ్ సహాయ సహకారాలతో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం రెండుకళ్ళల పరుగులు తీస్తుందని అన్నారు. కూటమిలో విభేదాలు సృష్టించాలని ఎందరు ప్రయత్నించిన అది జరగదని అందరినీ కలుపుకుంటూ సమన్యాయం చేస్తూ ముందుకు సాగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశి, తాడేపల్లిగూడెం మండల అధ్యక్షుడు అడప ప్రసాద్, పెంటపాడు మండలం అధ్యక్షుడు పుల్ల బాబి, తోటరాజ, సబ్జా సుబ్బు, చాపల రమేష్, పైపోయిన రఘు, పై బోయిన వెంకటరామయ్య, పాలూరి వెంకటేశ్వరరావు, అడబాల నారాయణమూర్తి, ముత్యాల ఆంజనేయులు, లక్ష్మణ రెడ్డి, గుండుమోగుల సురేష్, మలపాక చిట్టి, రైతు సోమరాజు, నిమ్మకాయల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment