మహిళల్ని మహరాణుల్ని చేయటమే కూటమి లక్ష్యం

*కూటమి సూపర్ సిక్స్ హామీలు బంపర్ సక్సెస్
*ఉచిత బస్సు పధకంతో మహిళల ఆత్మగౌరవానికి, ఆర్ధిక వెసులుబాటుకు పెద్దపీట వేసిన కూటమి ప్రభుత్వం
*కూటమి నేతలకు, ఘాన్సీ లక్ష్మీ భాయ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, స్వీట్లు పంపిణీ చేసిన జనసేన రాష్ట్ర మహిళా నాయకురాలు పార్వతి నాయుడు, జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: స్త్రీ శక్తి ఉచిత బస్సు పధకంతో కూటమి ప్రభుత్వం సంక్షేమ రంగంలో మరో ముందడుగు వేసిందని, మహిళల్ని మహారాణుల్ని చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జనసేన పార్టీ కృష్ణ, పెన్నా కో ఆర్డినేటర్ పార్వతి నాయుడు అన్నారు. జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు హిమని సెంటర్లో కూటమి నాయకుల మరియు ఘాన్సీ లక్ష్మీ భాయ్ చిత్రపటాలకు కూటమి నేతలు, వీరమహిళలు పాలాభిషేకం చేశారు. అనంతరం మహిళలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్వతి నాయుడు మాట్లాడుతూ.. ఏ సంక్షేమ పధకానికి రానంత స్పందన ఉచిత బస్సు పధకానికి వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఈ స్త్రీ శక్తి పధకంతో మహిళలకు ఆత్మ గౌరవంతో పాటూ పెద్ద ఆర్ధిక వెసులుబాటు కల్పించిందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ఇచ్చిన ప్రతీ హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చిఒదని పార్వతి నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రికార్డు స్థాయిలో సంక్షేమ పధకాలు విజయవంతంగా అమలు చేస్తుంటే వైసీపీ నేతలు ఆశ్చర్యపోతున్నారని జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. తమ నాయకుడు జగన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవస్థల్ని కుప్పకూల్చినా, రాష్ట్రాన్ని ఆర్ధికంగా దివాళా తీయించినా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు అభివృద్ధిని, సంక్షేమాన్ని ఏక కాలంలో ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో అర్ధం కాక వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారని ఏద్దేవా చేశారు. స్త్రీ శక్తి పధకంతో వైసీపీ నేతలకు మతి భ్రమించిందన్నారు. ఈ పధకం చిరు ఉద్యోగినులకు, విద్యార్థినులు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి పధంలో ముందుకు తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు, భగవంతుని ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయని ఆళ్ళ హరి అన్నారు. కార్యక్రమంలో కోలా పద్మావతి, లంకా మాధవి, ధరణి, సరోజినీ, నాజర్ వలి, బందెల నవీన్, బద్రి, రెల్లి నాగరాజు, ఆలపాటి రాకి, వడ్డే సుబ్బారావు, కోలా అంజి, నండూరి స్వామి, శెట్టి శ్రీను, రామకృష్ణ, హఫీజ్, తేజ, స్టూడియో బాలాజీ, జక్కా రాఘవులు, షంషేర్, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-08-17-at-6.28.58-PM-1024x710 మహిళల్ని మహరాణుల్ని చేయటమే కూటమి లక్ష్యం

Share this content:

Post Comment